Jul 31,2021 06:51

అమరావతి : సాంకేతిక కారణాల వల్ల 108 అత్యవసర నెంబర్‌ శనివారం అందుబాటులో ఉండదని ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు సిఇఒ వినయ్ చంద్‌ తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సుమారు మూడు గంటల పాటు ఈ నెంబర్‌ పనిచేయదని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిల్లో ఉన్న వారు 108 నెంబర్‌కు బదులు 08645660208, 8331033405కి ఫోన్‌ చేయాలని సూచించారు.