
1 నుంచి ఇంటికే రేషన్ బియ్యం
పజాశక్తి-నెల్లూరు :ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటికే రేషన్ బియ్యం పథకాన్ని అమలు చేస్తుందని, అందులో భాగంగా జిల్లాలో 524 వాహనాలతో ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే వచ్చి రేషన్ బియ్యం పంపిణీ చేస్తారని మంత్రి పి అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గురు వారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా పౌర సరఫరాల శాఖకు చెందిన మైబైల్ డిస్పెన్సింగ్ వాహ నాలను ప్రారంభించారు. నగరంలోని ఎ.సి. సుబ్బా రెడ్డి స్టేడియం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జిల్లా అధికారులు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 8,69,440 రేషన్ కార్డు దారులకు బియ్యం సరఫరా చేస్తుందన్నా రు. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. ఫిబ్రవరి 1 నుంచి రేషన్ బియ్యం ఇంటికే వచ్చి అందిస్తామన్నారు. అందుకోసం జిల్లాలో 524 వాహనాలు కేటాయిం చిందన్నారు. కలెక్టర్ కె.వి. ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుంచి జిల్లాలో ప్రతి రేషన్ కార్డు దారునికి ఇంటికే వచ్చి బియ్యం అందించడానికి మైబైల్ డిస్పెన్సింగ్ వాహనాలను ప్రారంభించినట్ల తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో బియ్యం పంపిణీకి 133, రూరల్ ప్రాంతాల్లో పంపిణీకి 391 మొత్తం 524 వాహనాలను సిద్ధం చేశామన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. తద్వారా వారికి ఉపాధి కల్పించా మన్నారు. యూనిట్ కాస్టు రూ. 5,81,109 కాగా లబ్ధిదారుడు 10 శాతం చెల్లించాలన్నారు. 30 శాతం బ్యాంకు లోన్, 60 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు.1 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకూ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, సివిల్ సప్లైస్ డి.ఎం.రోజ్ మాండ్, జెడ్పీ సి.ఈ.ఓ పి.సుశీల, జిల్లా అధికారులు, సిబ్బంది, లబ్దిదారు లు పాల్గొన్నారు..