
51. సుబాలను సర్కారులుగా విభజన చేసేవారు.
52.రాష్ట్రాలను సుభాలుగా పిలిచే వారు అయితే ఈ సుభాల అధికారిని సుబేదారుగా పేర్కొంటారు.
53. రాష్ట్రంలో క్రమానూగత శ్రేణీలో మొదటి అధికారి సుబేదారు తరువాత దివాను.
54. సుబేదారుకు దివానుకు మధ్య తలెత్తు వివాదాలను. చక్రవర్తి, చూసేవాడు.
55. దివాన్ ముఖ్య విధులలో శిస్తు వసూళ్లు, భూమి తగాదాలు పరిష్కరించడం, వ్యవసాయంను వృద్ధి పరుచుట.
56. రాష్ట్ర న్యాయ శాఖను క్వాజీ ఆధీనంలో వుంచేవారు. సాదరు కొన్ని ప్రాంతాలలో క్వాజీగా వ్యవహరించేవాడు.
57. పోలిసు శాఖ నిర్వహణ, సైనికుల భర్తీ మొత్తం కూడా మీర్ బక్షీ చూసేవారు.
58. సామ్రాజ్యం - రాజు సుబాలుగా - దివాన్, మీర్ బక్షీ సాదర్, సుమన్‌వార్
సర్కారులుగా, ప్రాజుదార్, అమిర్, కొత్వాల్, క్వాజీ - పరగణాలుగా షికాద్ధర్
59.సర్కార్‌ను నిర్వహిచునది ఫౌజ్‌దార్ యితనికి సహయకుడిగా అమిల్ అను అధికారి వుండేవారు.
60.పౌజ్‌దార్ యొక్క ప్రధాన విధి. గ్రామాల రక్షణ, సాయుధళలా నిర్వహణ, ఆరాచక వాదులను మట్టికరిపించడం.
61.నగరంలో శాంతి భద్రతలను కాపాడేవారు కొత్వాల్.
62.న్యాయ పాలన క్యాజీ ముఖ్యధికారి. మత సంబంధ కార్యక్రమాల నిర్వహణ, బీదలకు వస్త్రాల పంపీణీ యితని ఆధిక్యంలో వుండేవి. జకాత్, జిజియా పన్నులను వసూలు చేసేవారు.
63. పరిగణలో ముగ్గురు ప్రధాన అధికారులు వుండేవారు. ప్రతి పరిగణ ఒక బ్లాకుగా పేర్కొనే వారు.
64.పరిగణ అధికారులలో షిగ్ధార్, అమిన్, కానుంగో అను వారు ముఖ్యులు.
65. ప్రత్యక్ష పన్నులలో జిజియా, జకాత్ అను రెండు రకాల పన్నులు వుండేవి.
66. యిర్-ఫర్ - హబీబ్ మొగలు ఇండియాను వ్యవసాయ ఇండియాగా పేర్కొన్నాడు.
67.పండిన పంటలో సగభాగం పన్నుల రూపంలో వ్యవసాయ దారులు చెల్లించేవారు. మరియు తక్కాని రుణాల మంజురు కూడా గలదు.
68.భూమి శిస్తు వ్యవసాయక సంబంధాలు అను పుస్తకాన్ని రచించింది. ఇర్- ఫాన్-హబీబ్.
69.బ్రిటిషు పాలన పద్ధతులు నేడు మనము ఎక్కువగా అనుసరిస్తున్నాము.
70. బ్రిటీషు వారికంటే ముందు మనదేశంలో పోర్చిగ్రీసు మరియు డచ్‌వారు వర్తక వాణీజ్యాలు చేస్తు వుండేవారు.
71. 1600 సంవత్సరం డిసెంబర్ 31 నాడు బ్రిటీషు రాణీ సంతకం ద్వారా భారత దేశంలో ఈస్టు ఇండియా కంపెనీ స్థాపన జరిగింది.
72. ఈస్టు ఇండియా కంపేని రోజువారీ కార్యక్రమాల వివరాలు లండన్‌లో గల డైరక్టర్స్ ఆప్ బోర్డుకు తెలుపవలసి వచ్చింది.
73. ఈస్టు ఇండియా కంపెనికీ పటిష్టమైన పునాదీ వేయడంలో రాబర్ట్ క్లైవ్ ఎక్కువగా కృషి చేసినాడు.
74.కేంద్రీకృత పాలనాచ్పాయలు మొదటి సారిగా 1773 రెగ్యులేషన్ చట్టంలో విశదమవుతున్నాయి.
75. 1833 సంవత్సరంలో చేసిన పిట్ ఇండియా చట్టం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాలును ఇండియా గవర్నర్ జనరల్‌గా చేయడం జరిగింది.
76.1773 చట్టం నాటికి నలుగురు సభ్యులు గల ఉన్నత విధాన నిర్ణయా సమితి ఏర్పరుడుట జరిగింది. యిందులో అధ్యక్షుడికి నిర్ణయాత్మకమైన ఓటు హక్కు వుంటుంది.
77. 1858 చట్టం ద్వారా భారత పరిపాలన మొత్తం కూడా బ్రిటీష్ రాణి తన అధికారంలోకి తీసుకుంది.
78.1858 చట్టం ద్వారా క్యాబినెట్ మంత్రి హోదా గల ఒక ప్రభుత్వ కార్యదర్శి పదవి సృష్టిచబడింది.
79.1919 చట్టం ద్వారా ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వాలుగా ఏర్పాడతాయి.
80. వారెన్ హిస్టేంగ్స్ పరిపాలనలో జిల్లా ఒక యూనిట్‌గా కలెక్టర్ పరిపాలకుడిగా మారుటకు దోహద చేశాడు.
81.లార్డు రిప్పన్ భారత దేశంలో పాలన మొత్తం కూడా వికేంద్రీకరణకు దారీ తీయడానికి దోహదం చేశాడు.
82.సివిల్ సర్వీసుల చట్టం 1862లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం సర్వీసులు మూడు రకాలు
1. భారత సివిల్ సర్వీసులు , 2. రాష్ట్రీయ సివిల్ సర్వీసులు, 3. ఆదీన సివిల్ సర్వీసులు.
83. 1926 సంవత్సరంలో ఒక పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు అరున తరువాత క్రమంగా 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌గా మారింది.
84.కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించడానికి సర్కారియ కమీషన్‌ను ఏర్పాటు చేసింది.
85.బ్రిటీషు కాలంలో కలక్టర్లు ఏ విధంగా వ్యవహరించడం జరిగిందో అదే విధంగా నేడు కూడా వ్యవహరిస్తున్నారు.
86. 1947 కంటే పూర్వం ఐసిఎస్ గా 1947 తరువాత ఐఏఎస్‌గా మార్చరు.
87.శ్రీరాం మహేశ్వరీగారి అభిప్రాయంలో 1950లో ఏర్పరుచుకున్న నూతన వ్యవస్థ రెండు లక్షణాలు గలిగి వున్నాయి.
1. పార్లమెంటరీ ప్రజస్వామ్య పద్ధతి ,2. కేంద్ర రాష్ట్రాల మధ్య, అధికారల విభజన.
88. ప్రజల పాత్ర పరిపాలనలో పెంచడానికి పంచాయితీ రాజ్ వ్యవస్థలు ప్రారంభించబడ్డాయి.
89. 1947 సంవత్సరంలో పి.ఆర్ దత్ '' భారతదేశం ఈనాడు ప్రపంచంలో చలనంలేక మృగ్యంగా ఉండిపోయిన దేశంగా పేర్కొన్నారు.
90.ఉదార దిగుమతులు కోసం 1966లో 36% రూపాయి విలువను తగ్గించారు.
91. భారత రాజ్యాంగ ధ్యేయం సంక్షేమ రాజ్యాంగాన్ని అమలు చేయడం.
92. రజని కోఠారి మాటల్లో వ్యవస్థ నిర్మాణం ''భారత దేశ పాలన వైఫల్యానికి మూల కారణం'' అని అభిప్రాయం.
93. శ్యామల కుమార్ అభిప్రాయం ప్రకారం పౌర సర్వీసులు జన వ్యతి రేక సర్వీసులుగా మారడానికి కొన్ని కారణాలు
1.రహస్య పద్ధతి అవలం భించడం.
2.ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించడం.
3. శాసన సభలు కార్యనిర్వహణ వర్గంపై పట్టుకోల్పోవడం.
94.12 అతి సమర్ధవంతమైన పాలనావ్యవస్థలో భారత దేశ పాలనా యంత్రాంగం ఒకటి అని పేర్కొన్నాడు. బి-పాల్ ఆప్లేబి.
95.రోజువారి పరిపాలనా అసమర్థతకులోను కావడానికి ముఖ్యకారణంగా రాజకీయ నాయకుల జోక్యం.
96.పాలనా సామర్థ్యం దెబ్బతీయడానికి మరో కారణం ఉద్యోగుల పని పరిస్థితులు సంతృప్తి కరంగా లేవు.
97. ప్రభుత్వ విధానం అనగా ''ప్రభుత్వం ఏం చేయదలచుకుందో ఏమి వద్దు అనుకుంటుందో '' గా చెప్పవచ్చు.
98. పాల్ ఆప్లేబి ప్రకారం ''ప్రభుత్వ విధానం మొత్తం కూడా రూపకల్పనలో వుంది ఏ లక్ష్యాలు సాధించాలనుకుంటారో ఆ లక్ష్యాలకు విధానాలు ఆకృతి ఏర్పరుస్తాయి.
99.పాలనా శాస్త్రానికి రాజనీతి శాస్త్రానికి తేడా వుందని మొదటగా రచనలు చేసింది ఉండ్రోవిల్సన్, గుజోనోల్.
100.విధాన రూపకల్పన మొత్తం రాజకీయవిధి. కానీ దాని అదరణ మొత్తం పాలన విధిగా ఉంటుంది ఉండ్రోవిల్సన్.
చేగూరి కుమార్
ఎం.ఎ, ఎం.కామ్, ఎల్.ఎల్.ఎం, బి.ఇడి
సెల్: 9848789458