పెరుగుతున్న అవసరాలను బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి పరిశోధనా రంగం కూడా విస్తరిస్తోంది. కొత్త కొత్త ప్రయోగాలకు తెరతీస్తోంది. ఇది చక్కని ఉపాధి, ఉద్యోగ అవకాశాలేగాక సామాజిక సేవా దృక్పథంతో కూడిన రంగం కావడంతో యువత దీనిపట్ల మొగ్గు చూపుతోంది. పరిశోధనా రంగంలో భాగమైన క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ కోర్సులు చదివిన వారికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ వుంది.
ఒక ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టాలంటే దానిని జంతువులపై, వ్యక్తులపై ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వారిలో కన్పించే స్పందనలూ, ప్రతి స్పందనలూ, ఫలితాలూ, లోటుపాట్లూ, లోపాలూ బేరీజు వేస్తారు. దాని ఆధారంగా ఔషధ పనితీరును పరిశీలిస్తారు. దీనినే క్లినికల్ రీసెర్చ్ అంటారు. క్లినికల్ రీసెర్చ్ ఆధారంగా ఏ ఔషధం ఏ మేరకు ఫలితాన్నిచ్చిందో తెల్సుకుని అవసరమైతే మరో సత్ఫలితం ఇచ్చేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభిస్తారు. ఒక ఔషధంలో ఏ మోతాదులో ఏ మిశ్రమాన్ని వినియోగించాలో ఓ నిర్ణయానికి వస్తారు. ఈ ప్రక్రియనే క్లినికల్ ట్రయల్స్ అంటారు.
క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా మనుషులపై ఔషధాన్ని ప్రయోగించినప్పుడు ప్రతి దశలోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఫలితాలకూ, పర్యవసనాలకూ కారణాలు కనుగొంటారు. నివేదికలు తయారు చేస్తారు. ఇదంతా క్లినికల్ ట్రయల్స్ నిపుణుల విధికూడాను. నేడు దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మానవ అవసరాల రీత్యా, ఆరోగ్య భద్రతరీత్యా అనేక ఔషధాలూ, మందులూ అవసరమౌతున్నాయి. వీటిని తయారు చేయడంలో కీలకపాత్ర వహించే క్లినికల్ ట్రయల్స్, రీసెర్చ్ అవసరం కూడా పెరుగుతోంది. ఇంకో విషయం ఏమిటంటే 'యునైటెడ్ స్టేట్స్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ చేయనిదే ఏ ఔషధమూ మార్కెట్లో ప్రవేశ పెట్టేందుకు వీలు లేదు. అందుకోసం ప్రతి ఫార్మా స్యూటికల్ కంపెనీ 'డ్రగ్ డెవలప్ మెంట్' కోసం క్లినికల్ రీసెర్చ్ చేయాల్సిందే అందుకే దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది.
ఎంఎస్‌సి, ఫార్మసీ, బయోటెక్, డేంటల్ మెడిసిన్, ఎంబిబిఎస్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ తదితర అర్హత కలిగిన వారు ఈ కోర్సుల్లో ప్రశేశించవచ్చు.
బోధనా విధానం
క్లినికల్ డేటా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశించిన వారికి రీసెర్చ్, ట్రయల్స్ సంబంధిత సబ్జెక్టులతో పాటు, ప్రాక్టికల్‌గా ఉపయోగపడే విషయాలనూ బోధిస్తారు. అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తారు. రీసెర్చ్ కోసం వినియోగించే వ్యక్తులను సమన్వయ పరచడం... ఔట్‌సోర్సింగ్ కంపెనీలతో, సంస్థలతో వ్యవహరించాల్సిన తీరు. డాక్యుమెంటేషన్ తదితర అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. మెడికల్ పరిభాషపై పరిజ్ఞానం కల్పిస్తారు. దీనివల్ల కోర్సుల్లో రాణించడం సులభమౌతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉద్యోగ అవకాశాలు
ఈ కోర్సు పూర్తి చేసిన వారికి దేశ విదేశాల్లోనూ ఆకర్షణీయమై వేతనాలతో కూడిన ఉద్యోగవకాశాలు ఉన్నాయయి. క్లినికల్ ట్రయల్ అడ్మినిస్ట్రేటర్, సైట్ ఆపరేషన్స్, ఎగ్జిక్యూటివ్స్, క్లినికల్ ట్రయల్ మేనేజర్, ప్రాజెక్టుమేనేజర్ లాంటి ఉద్యోగాలు లభిస్తాయి. మన రాష్ట్రంలోని మెడ్విన్ హాస్పిటల్ అధ్యర్యంలో కోర్సు పూర్తి చేసుకున్న వారు కూడా నిమ్స్, గ్లోబల్, అపోలో హాస్పిటల్స్‌ల్లో, నోవాటీస్‌లో, రెడ్టిల్యాబ్స్‌లో ఉద్యోగాలు పొందారు. ఇక్కడేగాక అమెరికాలోని టేగ్జాస్ ఉమెన్స్ యూనివర్సిటీలోనూ, ఇతర సంస్థల్లోనూ అవకాశాలు సొంతం చేసుకున్నారు. భవిష్యత్తులో వీరికి మరింత డిమాండ్ పెరగనుంది.
నిపుణుల అవసరం
భారత దేశంలో ప్రస్తుతం యాభైవేలమంది క్లినికల్ రీసెర్చ్ నిపుణుల కొరత ఉందని మెక్‌కిన్సే నివేధిక తెలియజేసింది. క్లినికల్ రీసెర్చ్, ట్రయల్స్, డేటా మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రతి ఏటా ఎనిమిది వందల మంది మాత్రమే ఉత్తీర్ణులౌతున్నారు. మరోవైపు క్లినికల్ రీసెర్చ్ కోర్సు చేసే అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. భవిష్యత్తులో ఈ రంగం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
విదేశాల్లోనూ....
ఒక్క భారతదేశంలోనే కాదు.... విదేశాల్లోనూ క్లినికల్ రీసెర్చ్ అభ్యర్థుల కొరత తీవ్రంగానే ఉంది. ప్రస్తుతం రెండు లక్షలా యాభైవేల మంది అభ్యర్థుల అవసరం ఉంది. వీరికి ప్రారంభ స్థాయిలోనే 40 వేల నుంచీ 50 వేల డాలర్లు ఇంకా పైస్థాయి ఉద్యోగులకు లక్షడాలర్లు వార్షిక వేతనంగా ఇచ్చేందుకు సంస్థలూ, కంపెనీలూ ముందుకొస్తున్నాయి. అందుకోసం క్లినికల్ రీసెర్చ్ కోర్సు చేస్తే దేశంలోనే కాదు. విదేశాల్లోనూ మంచి అవకాశాలు ఉన్నాయి.
ఔట్‌సోర్సింగ్ పరంగా....
ఫార్మాస్యూటికల్ సంస్థలు మన దేశాన్ని చక్కటి ఔట్‌సోర్సింగ్ కేంద్రంగా కూడా భావిస్తున్నాయి. ఔట్ సోర్సింగ్ చేసే సంస్థలను కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లుగా వ్యవహరిస్తారు. ఫార్మా రంగంలో మంచి
అవకాశాలున్నాయి గనుక కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా
ఫార్మా సంస్థల అనుమతితో ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.
అనుకూల పరిస్థితులు
క్లినికల్ రీసెర్చ్‌కూ, దాని అభివృద్ధికీ మన దేశంలో అనువైన పరిస్థితులూ, అవకాశాలూ ఉన్నాయి. రకరకాల ఆహారపు అలవాట్లు ఉన్న మనుషులూ నివసిస్తున్నారు. ఈ పరిస్థితులు రీసెర్చ్‌కు తోడ్పడతాయి. దీనికి తోడు క్లినికల్ ట్రయల్స్‌లో పాలుపంచుకునేందుకు, సహకరించేందుకు ఇక్కడి రోగులు కూడా ముందుకు వచ్చేందుకు సహకరిస్తున్నారు. అదే విదేశాల్లో అయితే ఈ పరిస్థితి లేదు. అందుకే బహుళజాతి సంస్థలు తమ ప్రయోగాలకూ, ప్రయోజనాలకూ మన దేశంపై ఆధారపడుతున్నాయి. అయితే అవన్నీ ఎక్కువగా తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వస్తుంటాయి. ఇక్కడి వారికి ఉపయోగ పడేవిధంగా చర్యలు చేపట్టాలి. ఆ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్‌లో 'బయోమెడ్ ఇన్‌ఫార్మటిక్స్ డ్రగ్ డిస్కవరీ క్లినికల్ రీసెర్చ్ సంస్థ' మెడ్విన్ హాస్పిట్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్ మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తోంది. మీరూ ఆ రంగంలో ప్రావీణ్యం సంపాదించాలనుకుంటే, రీసెర్చ్ నిపుణులుగా స్థిరపడాలనుకుంటే, కోర్సులు చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక సంస్థ బయోమెడ్ ఇన్‌ఫార్మటిక్, మెడ్విన్ హాస్పిటల్, హైదరాబాద్‌లో సంప్రదించవచ్చు. పూర్తివివరాలకు www.biomedlifesciences.com
జి.వి.ఎల్.పి సుబ్బారావు
సెల్: 9989684450