పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ఒక తాలిబాన్ ఆత్మాహుతి బాంబరు శనివారం జరిపిన దాడిలో కనీసం 11 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. లాహోర్ నగరంలో రెండు ఆత్మాహుతి బాంబులు పేలి కనీసం 45 మంది శుక్రవారం మరణించిన విషయం మరిచిపోకముందే, శనివారం స్వాత్ లోయలోని భద్రతా చెక్‌పాయింట్ సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 35 మంది మరణించారు. 'మా కార్యకర్తలు ఈ దాడులు జరిపారు. దేశవ్యాప్తంగా మరిన్ని జరుపుతారు. ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం అమెరికా వలసగా మారడమే' అని తాలిబాన్ ప్రతినిధి తారిక్ అజాం గుర్తు తెలియని ప్రదేశం నుంచి రాయిటర్స్‌కు ఫోన్ చేసి చెప్పారు. ఈ ఆత్మాహుతి దాడికి ఒక రిక్షాను ఉపయోగించినట్లు మింగోరా నగర పోలీసు అధిపతి ఖాజీ గులాం ఫరూఖ్ తెలిపారు. అందులో ఇద్దరు సైనికులు, ముగ్గురు పోలీసులు, ఐదుగురు పౌరులు మరణించారు. ఒక వాహనంలో కొందరు మహిళలు సహా కనీసం ఐదుగురు దగ్ధమైపోవడాన్ని తాను చూసినట్లు ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మింగోరా ప్రధాన కోర్టుకు వెళ్ళే రోడ్డును కాంక్రీట్ శ్లాబ్‌లు, ఇసుక సంచులు, ముళ్ళతీగె కంచెతో మూసేశారు. ఆ బాంబుతో రెండు రిక్షాలు పాడైపోగా ఒక కారు దగ్ధమైంది. స్వాత్ లోయలోని ప్రధాన పట్టణమైన మింగోరాలో జరిగిన ఈ బాంబు పేలుడుకు సమీపంలోని భవనాల కిటికీలు ఊగిపోయాయి.మృతి