మూడేళ్ల భారతీయ బాలుడు గురుచరణ్ సింగ్ హత్య కేసు జూన్ 29కు వాయిదా వేస్తూ మెల్‌బోర్న్‌లోని కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గురుసేవక్ థిల్లాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించేందుకు సమయం కావాలంటూ ప్రాసిక్యూషను కోరడంతో మేజిస్ట్రేట్ స్పందించారు. నిందితుడు థిల్లాన్ (23) పార్ట్‌మైమ్ టాక్సీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. నేరపూరక నిర్లక్ష్యంతో మనిషి మరణానికి కారణమైన అభియోగం మోపడంతో థిల్లాన్ బెయిలు కోసం దరఖాస్తు కూడా చేయలేదు. కేసును అవగాహన చేసుకున్నావా, బెయిలు కోసం దరఖాస్తు చేయవచ్చని మేజిస్ట్రేట్ జెలీనా పొపోవిక్ ప్రశ్నించగా థిల్లాన్ తెలుసంటూ తలూపాడు.