ప్రజాశక్తి - కాకినాడ
పెంచిన విద్యుత్ ఛార్జీలను పూర్తిగా ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక కచ్చేరిపేట సుందరయ్య భవన్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరుగనుంది. ఈ మేరకు సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్.అజరు కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు నిర్వహిస్తున్న ఉద్యమంలో భాగంగా సిపిఎం, సిపిఐ, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుందని తెలిపారు. ఈ సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి దడాల సుబ్బా రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి మీసాల సత్య నారాయణ, సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి గొడుగు సత్యనారాయణ తదితరులు ప్రసంగి స్తారని తెలిపారు. ప్రజలు ఈ సదస్సులో పాల్గొని విద్యుత్ ఛార్జీల పెంపును అడ్డుకోవాలని ఆయన ప్రకటనలో కోరారు.