ఫారెస్టు అధికారుల దాడులు

  • మూడు లక్షల కలప స్వాధీనం
  • లబోదిబోమంటున్న బాధితులు

స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

శుక్రవారం ఉదయం అటవీశాఖ అధికారులు వేలుబెల్లి గ్రామంలో ఇళ్లలో నిల్వవున్న కలపను ఫారెస్టు అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సబ్‌ బిఎఫ్‌ఓ రాజశేఖర్‌, రేంజర్‌, సతీష్‌ కుమార్‌, గూడూరు రేంజర్‌ విజయలకిë, మొబైల్‌ పార్టీ రేంజర్‌ వెంకన్న పాల్గొని కర్ర కోత మిషన్‌, మంచాలు, కుర్చీలు, ఇంట్లో అక్రమ నిల్వ ఉంచిన పెద్దేగి కలపను ఫారెస్టు అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులు లబోదిబోమంటున్నా వినకుండా కర్రను వ్యాన్‌లో ఎక్కించుకొని కొత్తగూడ లైన్‌కు తరలించారు. ''ఇది మేము పైసలు పెట్టి కొన్నాము. అక్రమంగా తీసుకున్నది కాదు. అలాంటి ఫారెస్టు అధికారులు మా పై దాడి చేసి మా ఊరిలో కర్రను తీసుకుపోవటం సరికాదు'' అని బాధితులు సమ్మయ్య, వెంకన్న, శ్రీను, సురేందర్‌ అన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్