డిపిఆర్‌వో వెంకటరమణ అన్నారు. నగరంలోని మధ్యకోటలోని ప్రభుత్వ సహాయ ఆర్య బాలుర ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న పిడిశెట్టి స్వరాజ్యరావ్ పదవీ విరమణ అభినందన సభ బుధవారం నిర్వహించారు. సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా నుండి గర్వించతగిన గాయాకుల జాబితాలో స్వరాజ్యరావ్ ముందుంటారన్నారు. స్వరాజ్యరావ్ చేసిన సమర్ధనీయ సేవలను కొనియాడారు. విశిష్ట అతిథిగా హాజరైన రిటైర్డు ఉప విద్యా శాఖాధికారి, ప్రముఖ కళాకారులు బూర విద్యాసాగర్ మాట్లాడారు. అత్మీయ అతిథులుగా జిల్లా సాంస్కృతిక మండలి సభ్యులు పాత్రికేయులు పివి మదన్‌మోహన్, ప్రభుత్వ పాలిటెక్నిక్ రిటైర్డు సీరియర్ లెక్చరర్ గట్ల రాంరెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం స్వరాజ్యరావ్ దంపతులకు ఘనంగా సత్కరించారు.