కాంగ్రెస్‌పై దుష్ప్రచారం తగదు : మంత్రి పొన్నాల

కాంగ్రెస్‌పై టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, బిజెపిలు దుష్ప్రచారం చేయడం తగదని రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం చేప ట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. అనంతరం మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లా డుతూ కాంగ్రెస్‌ పాలనలోనే అభివృద్ధి జరిగింద న్నారు. పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. సాంబారి సమ్మారావుకు ఓట్లు వేసి గెలిపిస్తే మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా మని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ద్వారానే సాధ్యమని, త్వరలోనే అధిష్టానం సానుకూలం గా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కొండా మూడు సార్లు పాలన అభివృద్ధి శూన్యం డబ్బు కూడబెట్టు కున్నారన్నారు. ప్రజలకు చేసిందేమీ లేదు. టిడిపి పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్ప డితే పట్టించుకోలేదని, పైగా రైతులను పిట్టల్లా కాల్చి చంపారని ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి ప్రజలకు చాలా తక్కువ సేవలు చేసి పదవిని కాపాడుకునేందుకే పరి మితమైందని అన్నారు. ఆమె డబ్బులను కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించా రు. టిఆర్‌ఎస్‌ కేవలం ప్రజలను ప్రాంతీయ వాదంతో మోస గిస్తూ స్వార్థ రాజకీయాలకు పాల్పడేందుకు మాత్రమే సృష్టించబడిందని, ఆ పార్టీ నేతల్లో చిత్తశుద్ధి కొరవడిందన్నారు. తెలంగాణ సాధిస్తామంటూ ప్రగల్భాలు పలుకు తున్న కెసిఆర్‌, హరీష్‌రావులు పూటకో రకంగా మాటలు చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ద్వారానే తెలంగాణ ఏర్పడుతుందని తెలిపారు. బిజెపి జాతీయ పార్టీగా చెప్పుకుంటూ తెలంగాణా ఇస్తామని ప్రక టించడం విడ్డూరంగా ఉందన్నారు. బిజెపి ప్రజల సమస్యలపై పట్టించుకున్న పాపాన పోలేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్‌ అభ్యర్థి సాంబారి సమ్మారావును గెలిపించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టిడిపి, టిఆర్‌ఎస్‌, బిజెపిలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో ఎంపి సిరిసిల్ల రాజయ్య, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొంతి మాధవరెడ్డి, జిల్లా నాయకులు వరద రాజేశ్వర రావు, మండల నాయకులు తుప్పరి సూర్యనారా యణ, సూరం రంగారెడ్డి, సుదర్శన్‌, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.