మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన శ్రీరాం చిన్ని(55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతి చెందాడు. భార్య లక్ష్మి కథనం మేరకు... చిన్ని ఉదయాన్నే పొలం వద్దకు వెళ్లాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక స్పృహతప్పి పడిపోగా పక్క పొలంలో ఉన్న రైతులు చూసి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండగా అప్పటికే చిన్ని మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.