గీత కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు

  • కెజికెఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ

కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ అన్నారు. గీత వృత్తిలో ప్రమాదానికి గురై మృతిచెందిన వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను సంవత్సరం నుండి ఇవ్వడం లేదని విమర్శించారు. సంఘం జిల్లా కమిటీ సమావేశం కుర్ర ఉప్పలయ్య అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వందలాది మంది వృత్తిలో ప్రమాదానికి గురై చనిపోవడం, వికలాంగులు కావడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం 555జీవో ద్వారా ఎక్స్‌గ్రేషియాను రద్దు చేసి ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పజెప్పిందని అన్నారు. ఒప్పంద గడువు 21సెప్టెబర్‌ 2009నాటికి ముగిసిందన్నారు. అప్పటి నుండి నేటి వరకు రాష్ట్రంలో సుమారు 800మంది ప్రమాదానికి గురయ్యారని, వరంగల్‌ జిల్లాలో 120మంది ఉన్నారని అన్నారు. మృతుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో బాధితులతో ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు. గీత కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాలని, కొత్తగా వేసిన వృత్తి పన్ను రద్దు చేయాలని, ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు నాలుగు నుండి 14వరకు డివిజన్‌ స్థాయిలో సొసైటీ అధ్యక్షులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, సంబంధిత అధికారులను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డివిజన్‌ నాయకులు వెంకన్న, గందశిరి శ్రీనివాస్‌, గాదగోని లింగయ్య, శంకరయ్య, బుర్ర సుధాకర్‌, మేరుకు వీరస్వామి, అరుణ్‌ పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్