లాల్‌ సలాం త్రిపుర

తూరుపున ఉదయించిందరుణతార

జనం త్రుళ్లి పడిలేచారు పరవశాన

వర్గపోరు సాగింది త్రిపురలోన

ప్రజలు ఉగ్రరూపమెత్తినారు రణములోన

సమరశంఖమూదినారు వాడవాడలా

ప్రజలు చావు దెబ్బ తీశారు స్వార్థ నేతల

ఏడుసార్లు గెలిచారు ఏకధాటిగా

అది ఎదురులేని పోరుగడ్డ ఎల్లవేళలా

అవినీతికి తావులేదు ఆ పాలనలో

అన్యాయాలక్రమాలు అసలే లేవు

గిరిజనులను, పురజనులను ఐక్యం చేసి

దేశమంతటికి వారొక దారి చూపిరి

అడవులలో నడుస్తున్నది స్వయం పాలన

అది ఆదర్శం, అభ్యుదయం, ప్రజాస్వామికం

రేషనింగు పెట్టినారు రాష్ట్రమంతటా

మోసమసలు కానరాదు లేశమాత్రము

సామాన్యులకందుతాయి చౌకబియ్యము

రాబందుల పాత్రలేని రామ రాజ్యము

త్రిపురను పాలిస్తున్నది కమ్యూనిస్టులు

స్వ, పర బేధము ఎరుగని సోషలిస్టులు

ఐదుసార్లు ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌

అత్యంత ఆదర్శం ఆయన స్వంతం

ఐదు వేల అలవెన్సుతో జీవనయానం

అలవికాదు అందరికీ ఆయన మార్గం

త్యాగధనులెందరికో పుట్టినిల్లు త్రిపుర

పొరబాట ఎన్నిటికీ వదలలేదు కనుక

రెండుసార్లు ముఖ్యమంత్రి

పెద్దాయన నృపేన్‌

గరీబు చక్రవర్తిగా గణుతికెక్కె భువిలో

గిరిజనుల్లో పుట్టినట్టి ఘన

యశస్వి దశరథ్‌దేవ్‌

పార్లమెంటు, ముఖ్యమంత్రి

పదవులకే వన్నె తెచ్చే

ఇంతటి ఘన చరిత్ర గల

త్రిపుర మహా జనానికి

దేశానికి ప్రత్యామ్నాయం

చూపిన రణధీరులకు

లాల్‌సలాం అందించుట

మన అందరి కర్తవ్యం