అంగటి సరుకుగా వైద్యం

సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలతో వైద్య రంగం అంగటి సరుకుగా మారిపోయింది. 'నానాటికీ తీసికట్టు నాగంభొట్లు' అన్న చందంగా తయారైంది. ప్రయివేటు ఆసుపత్రులు వైద్యాన్ని వ్యాపార దృష్టితో చూడడంతో నైతిక విలువలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే 'మోసపు ముసుగులైన ఐసియులలో వైద్యం ఇస్తున్నామంటూ తల్లిదండ్రుల్నిగానీ, బంధువుల్నిగానీ మనిషిని చూడనీయకుండా చేస్తున్నారు. వైద్యం ఇస్తున్నామని అంటూనే ప్రాణం పోయినా గానీ వెంటనే చెప్పకుండా డబ్బులు తీసుకున్న తర్వాత ప్రాణం పోయింది తీసుకెళ్లండని చల్లగా చెబుతున్నారు. ఇలా వైద్యుల మోసాలకు అడ్డూ అదుపు లేదు. మన ప్రభుత్వం కార్పొరేట్లకు అండగా ఉండబట్టే ఇలాంటివి నిత్యం జరుగుతున్నాయి. అందువలనే మేధావులు ఆలోచన చేసి రోగులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించాలి. ఏ చికిత్స జరుపుతున్నా బంధుగణాన్ని నిర్భయంగా పరిమిత సమయాలలోనైనా లోనికి అనుమతించాలి. వైద్య సంస్థలు పారదర్శకంగా పని చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

"); -->