సరైనవారినే ఎన్నుకోవాలి

కుంభకోణాలతోపాటు, మద్యం ఇసుక మాఫియాలు కూడా ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. దేశంలో అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఏ ఉదంతం చూసినా, దాని వెనుక ఎవరో ఒక రాజకీయ నాయకుని హస్తం ఉంటున్నది. ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, బొత్సకు పడనందున మద్యం కుంభకోణం బయటకు వచ్చింది. దీర్ఘకాలం ఒకేపార్టీ పాలన ఉంటే అదే పరిస్థితి వస్తుంది. ఇసుక విషయంలో రాజకీయ నాయకులు పరస్పరం ఇసుక చల్లుకుంటున్నారు. రాజకీయ అధికార పొగరు, అవినీతితో భ్రష్టుపట్టిన ఈ సమాజాన్ని బాగు చేయాలంటే మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలి. ఆ ప్రక్రియ స్థానిక ఎన్నికల నుండే మొదలు కావాలి.