అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బిఐ) అరెస్ట్ చేసిన డేవిడ్ హేడ్లీ కేసులో రహస్య అజెండాతో అనుసరిస్తున్న వైఖరికి తక్షణమే స్వస్తి చెప్పాలని సిపిఎం పొలిట్‌బ్యూరో కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎఫ్‌బిఐ హేడ్లీని అరెస్ట్ చేసి ఆర్నెల్లు దాటినా, ముంబయి దాడుల్లో తనకు భాగస్వామ్యం ఉన్నట్లు కోర్టులో అంగీకరించినా ఆయన్ను ప్రశ్నించేందుకు అమెరికా భారత అధికారులకు అనుమతి నిరాకరిస్తోందని, అయితే భారత్ దానికి భిన్నంగా ముంబయిలో నిర్బంధంలో ఉన్న అజ్మల్ కసబ్‌ను ప్రశ్నించేందుకు ఎఫ్‌బిఐకి అనుమతినిచ్చిందని పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో గుర్తు చేసింది. అమెరికా మాదకద్రవ్య రవాణా నిరోధక విభాగానికి (డిఇఎ) హేడ్లీ ఏజెంట్‌గా వ్యవహరించేవాడని అందరికీ తెలిసిందేనని, ముంబయి దాడులకు ముందు, తరువాత అతడు ముంబయిని సందర్శించడం, అరెస్ట్ అనంతరం అమెరికా అధికారులు అనుసరిస్తున్న వైఖరి అతణ్ణి డబుల్ ఏజెంట్‌గా రుజువు చేస్తున్నాయని తెలిపింది. అయినా అమెరికా అనుకూల రహస్య అజెండాతో యుపిఎ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎవరికీ అర్థం కావడం లేదని పేర్కొంది.అమెరికా వైఖరిని సమర్థించేందుకు యుపిఎ ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతోందని విమర్శించింది. హేడ్లీ కేసు కోర్టులో ఉన్నందున అతణ్ణి ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వలేకపోయినట్లు చెబుతున్న అమెరికా గతంలో అరెస్టు చేసిన వెంటనే అతణ్ణి ప్రశ్నించేందుకు తమ దేశానికి వచ్చిన భారత ప్రతినిధి బృందానికి ఎందుకు అనుమతి నిరాకరించిందో చెప్పాలని డిమాండ్ చేసింది.
1బేరాలాడుతూ, విజ్ఞప్తులు చేసినంత మాత్రాన హేడ్లీని అమెరికా భారత్‌కు పంపదన్న విషయం తెలిసినప్పటికీ ఇంకా తాను ఓర్పుగా ఎదురు చూస్తానని హోం మంత్రి చిదంబరం చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొంది. భారత్-అమెరికా సంబంధాలలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ వైఖరి ద్వారా మరోసారి రుజువైందని తెలిపింది. అమెరికాకు ఎంతసేపూ తన ఆఫ్ఘన్-పాక్ వ్యూహంపైనే దృష్టి తప్ప, ముంబయి దాడులకు సంబంధించిన ప్రధాన నిందితుడిపై జరుగుతున్న దర్యాప్తులో సహకరించేందుకు ముందుకు రావడం లేదని విమర్శించింది.
ఇప్పటికీ మన ఇంటెలిజెన్స్, భద్రతా అధికారులకు హేడ్లీని ప్రశ్నించేందుకు అటు సిఐఎ కానీ, ఎఫ్‌బిఐ కానీ అనుమతించకపోవడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరచి హేడ్లీని తక్షణమే ప్రశ్నించేందుకు అవకాశం కోసం అమెరికాను డిమాండ్ చేయాలని, సహకారం అనేది ఇచ్చిపుచ్చుకునేదిగా ఉండాలని అమెరికాకు చెప్పాల్సిన అవసరముందని సిపిఎం కేంద్రానికి సూచించింది.
సర్కార్‌కు లోపించిన చిత్తశుద్ధి
ఓటరు జాబితాల్లో అవకవతవకలు
ఇనుప ఖనిజం ఎగుమతులపై నిషేధం!
బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ ఎమ్మెల్యేల ఆగడం స్పీకర్‌కు అస్వస్థత
జంగల్మహల్లో మరి కొంతకాలం కేంద్ర బలగాలు
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ముసాయిదా బయటపెట్టాలి
సిబిఐ విచారణ జరిపించాలి : ఎర్రన్నాయుడు
జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలనకు 'పెద్దల' ఆమోదం
మూడో రోజూ స్తంభించిన పార్లమెంట్