మధ్యప్రదేశ్‌లో సర్వత్రా ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రంలోని బాలల్లో సుమారు 60 శాతం మందికి సరైన పౌష్టికాహారం లభించడం లేదని రాష్ట్ర ఆరోగ్య అధికారులు అంగీకరిస్తున్నారు. పౌష్టికాహారం అందని కారణంగా బాలల మరణాలు నిత్యకృత్యమైపోయాయి. గత నాలుగేళ్లలో సుమారు 1.2 లక్షల మంది బాలలు సరైన ఆహారం లేక రోగాల బారినపడి చివరకు ప్రాణాలు కోల్పోయారు. అంటే సగటున రోజుకు 83 మంది బాలలు మరణించారు. రెండు రోజుల కోసారి జొన్న పిండిని ఉడకేసుకు తిని ప్రాణాలు కాపాడుకుంటున్నట్లు కుమ్ముడి అనే మహిళ కుటుంబం వాపోయారు. ఆమె ఇద్దరు కూతుళ్ళు గ్రామంలోని అంగన్‌వాడిలో ఆహారం స్వీకరించేందుకు అనుమతి పొందినా అంత దూరం వారిని తీసుకెళ్ళగల శారీరక బలం కుమ్ముడికి లేని దుస్థితిలో ఉన్నారు. ఆమె అత్త రవీబాయి మాట్లాడుతూ తమ గోడు ఆలకించే వారే లేరన్నారు. చికిత్సకు రూకలు దొరకక బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నట్లు ఆవేదనగా అన్నారు. ఇలాంటి దుస్థితే సత్న, కండ్వా, ధార్, శివపూరి, షియోపూర్, సిధీ, రేవా, ఖర్గాన్, జబువాలాంటి అనేక గిరిజన ప్రాంతాల్లో నెలకొని ఉంది.
సర్కార్‌కు లోపించిన చిత్తశుద్ధి
ఓటరు జాబితాల్లో అవకవతవకలు
ఇనుప ఖనిజం ఎగుమతులపై నిషేధం!
బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ ఎమ్మెల్యేల ఆగడం స్పీకర్‌కు అస్వస్థత
జంగల్మహల్లో మరి కొంతకాలం కేంద్ర బలగాలు
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ముసాయిదా బయటపెట్టాలి
సిబిఐ విచారణ జరిపించాలి : ఎర్రన్నాయుడు
జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలనకు 'పెద్దల' ఆమోదం
మూడో రోజూ స్తంభించిన పార్లమెంట్