పాక్‌లో ఢిల్లీ !

  • బంగాళాఖాతంలో కొల్‌కతా!
  • ఇది రైల్వే శాఖ లీల

రైల్వే శాఖ మన దేశ రాజధాని ఢిల్లీని పాకిస్తాన్‌లో, పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర రాజధాని కొల్‌కతాను బంగాళా ఖాతంలో కలిపేశారు. తూర్పు రైల్వే శాఖ శనివారం వివిధ పత్రికలకు ఇచ్చిన ప్రకటనలో ఈ లీలలు కనిపించాయి. లగ్జరీ టూరిస్టు రైలు 'మహారాజ ఎక్స్‌ప్రెస్‌' ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన ప్రకటనలో రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ చిత్రపటం కూడా ఉంది. ఈ ప్రకటన కొల్‌కతా నుండి వెలువడింది. రైలు కొల్‌కతా నుండి గయా, వారణాసి, బందబ్‌గఢ్‌, ఖజూరహో, ఆగ్రా, గ్వాలియర్‌ మీదుగా ఢిల్లీకి చేరుకునే రూట్‌ మ్యాప్‌ను ప్రకటనలో బాక్స్‌ కట్టి ప్రచురించారు. ఆ బాక్సు బ్యాక్‌ గ్రౌండ్‌లో మనదేశ మ్యాప్‌ను ప్రచురించారు. దాని ప్రకారం బంగాళాఖాతంలో కొల్‌కతా, పాకిస్తాన్‌లో ఢిల్లీ కలిసిపోయాయి. 'ఇది పెద్ద తప్పిదమే. దీనికి మేము క్షమాపణ కోరుతున్నాం. దీనికి కారణమైన ఎడ్వర్టయిజ్‌మెంట్‌ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటాం' అని తూర్పు రైల్వే శాఖ పిఆర్‌ఓ సమీర్‌ గోస్వామి చెప్పారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్