మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పవార్‌ మద్దతు

    న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషను బిల్లుకు మద్దతు తెలియజేయడం ద్వారా ఎన్‌సిసి అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అందరి ఊహాగానాలకు తెరదించారు. యుపిఎ-2లో ఎన్‌సిపి కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఇక్కడ జరిగిన ఖరీఫ్‌-2010ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయించే అంశానికి తాను అనుకూలమన్నారు. బిల్లు యథాతథ స్థితిలోనే లోక్‌సభలో కూడా ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. మైనారిటీలకు, ఇతర వెనుక బడిన వర్గాలకు రాజ్యాంగం ఎలాంటి రిజర్వేషను కల్పించలేదన్నారు కోటా తగ్గించాలని తామెన్నడూ కోరలేదన్నారు. ఈబిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదిపార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌తో సంప్రదించానని అయితే బిల్లులో పేర్కొన్న 33శాతం తగ్గింపును ములాయం కోరుకోవడం లేదని పవార్‌ తెలిపారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి చతుర్వేది వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ అంకం ముగిసిపోయిందన్నారు. అధికార ప్రతినిధిగా చతుర్వేది బాధ్యతలు విస్మరించినందున ఆయన నుంచి క్షమాపణలు ఆశిస్తున్నారా అని ప్రశ్నించగా పవార్‌ లేదని బదులిచ్చారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్