లక్నో : అన్ని విమర్శలనూ బేఖాతరు చేస్తూ బిఎస్‌పి అధినేత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతికి బుధవారం మరోసారి కరెన్సీ నోట్ల దండ వేశారు. దాని విలువ రూ.18 లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ర్యాలీలో ఆమెకు రూ.21 నుంచి రూ.15 కోట్ల మధ్య విలువైన కరెన్సీ నోట్లతో ఉన్న మాలను వేయడంతో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినప్పటికీ, బుధవారం జరిగిన పార్టీ నేతల సమావేశంలో వివిధ విలువలున్న నోట్లతో తయారు చేసిన మాలను ఆమె మెడలో వేశారు. 'ఆమె ఎక్కడికెళ్ళినా పూలమాలలతో గాక కరెన్సీ దండలతో గౌరవిస్తున్నారు' అని రాష్ట్ర పిడబ్ల్యుడి శాఖా మంత్రి నసీముద్దీన్ సిద్ధిఖీ సమావేశం అనంతరం విలేకరులకు చెప్పారు. వెయ్యి రూపాయల నోట్లతో తయారు చేసిన అనేక కోట్ల విలువైన దండలు వేయించుకున్నందుకు ఆమెపై పార్లమెంటు లోపల, వెలుపల తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మహా ర్యాలీలో ఆమెకు బహూకరించిన దండకు ఉపయోగించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు జరపాలని ఆదాయపన్ను విభాగం నిర్ణయించింది. దీనిపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా కాంగ్రెస్, బిజెపి, సమాజ్‌వాది పార్టీలు డిమాండ్ చేశాయి. ఆ కరెన్సీ దండల విలువ కోట్లాది రూపాయలున్నట్లు వస్తున్న ఊహాగానాలను సిద్ధిఖీ మంగళవారం త్రోసిపుచ్చారు. వాటి మొత్తం విలువ కేవలం రూ.21 లక్షలేనన్నారు.
బిఎస్పీకి త్వరలో ఐటి నోటీసులు : కరెన్సీ మాలలపై దర్యాప్తు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కరెన్సీ పూలదండల వ్యవహారాన్ని ఆదాయపు పన్ను శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) రజతోత్సవాల సందర్భంగా పార్టీ నాయకులు ఆమెకు మంగళవారం కరెన్సీ నోట్లతో కూడిన భారీ మాల వేసిన సంగతి తెలిసిందే. దాని విలువ రూ.10 కోట్లా? లేక 15 కోట్లా? అనే చర్చ జరుగుతున్న నేపథ్యం లోనే బుధవారం కొందరు కార్యకర్తలు మళ్లీ అలాంటి నోట్ల మాలతో ఆమెను అలంకరించారు. ఈ రెండు గజమాలల వ్యవహారాన్ని ఆదాయపు పన్ను శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే దీనిపై దర్యాప్తును వేగవంతం చేస్తోంది. అడిషనల్ జాయింట్ డైరెక్టర్ (దర్యాప్తు) దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యాక బిఎస్‌పికి నోటీసులు జారీ చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
మాయావతి దండ ఖరీదు 22.5 కోట్లు : కాంగ్రెస్
ఇటీవల జరిగిన బిఎస్పీ ర్యాలీలో యుపి ముఖ్యమంత్రి మాయావతికి అలంకరించిన కరెన్సీ నోట్ల దండ విలువ రూ.22.5 కోట్ల పైమాటేనని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ దండ విలువపై ఊహా గానాలు చెలరేగుతున్న నేపథ్యంలో యుపిసిసి ఈ విషయాన్ని వెల్లడించింది. యుపి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజరుసింగ్ బుధవారం ఒక టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఘటనపై జరుగుతున్న ఆదాయపు పన్ను విచారణను తప్పించుకునేందుకు అందులోని సాక్ష్యాలను మాయావతి ధ్వంసం చేసినట్లు విమర్శించారు. ఆ దండలోని నోట్లను తాను లెక్కించినట్లు ఆయన చెప్పారు. ఆందులోని ప్రతి రింగులోనూ 45 వెయ్యి రూపాయల నోట్లున్నాయని, ప్రతి సెంటీమీటర్‌కు ఐదు రింగుల వంతున 2,25,000 నోట్లు అవుతాయని, పది మీటర్ల పొడవున్న ఆ దండలో మొత్తం వెయ్యి రింగులున్నందున 2.25 లక్షలను వెయ్యితో గుణిస్తే మొత్తం 2.25 కోట్ల రూపాయలున్నట్లు తాను నిర్థారించుకున్నానని ఆయన వివరించారు. అయితే ప్రతిపక్షాలు ఆ దండపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బిఎస్పీ ఎదురుదాడి ప్రారంభించింది. పార్టీ అగ్రనేతలను ఇటువంటి దండలతో సత్కరించడం లేదా తులాభారం తూయడం వంటివి సాంప్రదాయికంగా వస్తున్నవేనని, ఇది అన్ని పార్టీల్లోనూ ఉన్నట్లు బిఎస్పీ వర్గాలు స్పష్టం చేశాయి.
సర్కార్‌కు లోపించిన చిత్తశుద్ధి
ఓటరు జాబితాల్లో అవకవతవకలు
ఇనుప ఖనిజం ఎగుమతులపై నిషేధం!
బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ ఎమ్మెల్యేల ఆగడం స్పీకర్‌కు అస్వస్థత
జంగల్మహల్లో మరి కొంతకాలం కేంద్ర బలగాలు
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ముసాయిదా బయటపెట్టాలి
సిబిఐ విచారణ జరిపించాలి : ఎర్రన్నాయుడు
జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలనకు 'పెద్దల' ఆమోదం
మూడో రోజూ స్తంభించిన పార్లమెంట్