ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సోమవారం రాష్ట్ర విభజనపై అట్టుడిగింది. రాష్ట్ర విభజనను సమాజ్‌వాది పార్టీ సభ్యులు వ్యతిరేకించారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రీయ లోక్‌దళ్ సభ్యులు అజరు తొమార్ ఈ అంశాన్ని లేవనెత్తుతూ రాష్ట్ర విభజనకు మార్గం సుగమం చేస్తూ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనుందా అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి కేంద్రం నుండి త్వరలో ఓ ప్రతిపాదన అందిన తర్వాత అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెడుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి లాల్జీ వర్మ చెప్పారు. రాజ్యాంగం ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర అనుమతి పొందిన తర్వాతే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియను ప్రారంభిస్తాయని వర్మ అన్నారు. యుపిను చీల్చి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మాయావతి ప్రభుత్వం ఇప్పటికే అనుకూలంగా ఉంది. కానీ, ఇది సాధ్యం కావాలంటే కేంద్ర అంగీకారం తప్పనిసరి అన్నారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటును ఎస్‌పి సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.