త్రిపురలో ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసినందునే ఇటీవలి ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్‌కు ప్రజలు ఘన విజయాన్ని అందించారని సిపిఎం ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కరత్ అన్నారు. ఇక్కడ గురువారం జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ 'రాష్ట్రాభివృద్ధి, శాంతి, ప్రజా సంక్షేమం కోసం కట్టుబడిన ప్రభుత్వం అమల్జేసిన ప్రత్యామ్నాయ విధానాలకు లభించిన ఈ విజయం దేశ నలుమూలలకూ సరికొత్త సందేశాన్ని చేరవేసింది. దేశంలోనే త్రిపురను తలమానికంగా నిలిపింది' అని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారులను, బహుళ జాతి కంపెనీలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.
'త్రిపుర ప్రభుత్వం వైవిధ్యమైనది. మత సామరస్యాన్ని, శాంతిని కాపాడుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న అవినీతి రహిత ప్రభుత్వమిక్కడుంది' అని ప్రశంసించారు. త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి బుధవారం ప్రమాణస్వీకారం చేసిన మాణిక్‌సర్కార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమల్జేస్తుందని, వాటితో పాటు మరిన్ని ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
java.lang.NullPointerException