మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో వృద్ధాప్యపు పెన్షన్‌ను ద్రవ్యోల్బణ సూచీతో ముడిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎపిఎల్, బిపిఎల్ ప్రామాణికాలను ఎత్తివేయడం ద్వారా దీన్ని సార్వజనీనం చేయాలని కూడా భావిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం రాజ్యసభలో తెలిపింది. వితంతువులకు ప్రస్తుతమున్న వయస్సు పరిమితి 40 ఏళ్ళను తొలగించి దానికి బదులుగా 18ఏళ్ళ పాటు వారికి పెన్షన్ లభించేలా చూడడం, అలాగే 40శాతం వైకల్యం ఉన్న వారికి కూడా వికలాంగుల పెన్షన్ వర్తించేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వికలాంగ పెన్షన్‌కు ప్రస్తుతం అయితే 80శాతం వైకల్యం వుంటేనే పెన్షన్ వస్తుంది. పెన్షన్ పరిషద్‌తో రెండు దఫాలు చర్చలు జరిగిన తర్వాత ఈ విషయమై ప్రభుత్వం ఒక స్థూల ఏకాభిప్రాయానికి వచ్చింది. పెన్షన్ పథకాన్ని సార్వజనీనం చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన వృద్ధులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రస్తుతం నెలకు రు.200 ఇస్తున్న పెన్షన్‌ను రు.2వేలు చేయాలని కోరుతూ వృద్ధులు ధర్నా చేయడం పట్ల రాజ్యసభ సభ్యులు స్పందించారు. అయితే ఈ పెన్షన్‌ను నెలకు 300 చేయాలని నిర్ణయించినట్లు సభ్యులకు మంత్రి జైరామ్ రమేష్ తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మాదిరిగా దీన్ని కూడా ద్రవ్యోల్బణ సూచీతో ముడిపెట్టనున్నట్లు తెలిపారు.
java.lang.NullPointerException