ప్రజలకు పాస్‌పోర్టులు, పెన్షన్లు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు వంటి వాటిని నిర్దిష్ట కాల పరిమితిలోగా అందచేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు బిల్లును ఆమోదించారు. తన విధులను సక్రమంగా నిర్వర్తించని ప్రభుత్వ అధికారిపై రూ.50 వేల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లు పేర్కొంటోందని అధికార వర్గాలు తెలిపాయి. పౌర నిబంధనావళిని ప్రచురించాలని, ఎంత కాల పరిమితిలోగా ఏయే సేవలు అందించబడతాయో అందులో స్పష్టంగా పేర్కొనాల్సి వుంటుంది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని వారి కోసం సమస్యల పరిష్కార యంత్రాంగం కూడా ఏర్పాటు చేయబడుతుంది.
సేవలను సకాలంలో అందించేందుకు గానూ కాల్ సెంటర్, కస్టమర్ కేర్ సెంటర్, హెల్ప్ డస్క్, పీపుల్స్ సపోర్ట్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసేందుకు ఈ ప్రతిపాదిత బిల్లు ఉద్దేశించబడింది. కేంద్రంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ కూడా సమస్యల పరిష్కార కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బిల్లు కోరుతోంది.
java.lang.NullPointerException