ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సమాయత్తం

  • సిపిఎం విస్తృత సమావేశం పిలుపు
  • జనం సమస్యలు ఎజెండాలోకి తెచ్చేందుకే స్వతంత్రంగా పోటీ

ప్రజా సమస్యలపై స్వతంత్రంగానూ, ఐక్యంగానూ ఉధృత ఉద్యమాలు నిర్వహించటం తక్షణ కర్తవ్యమని మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం నిర్ణయించింది. పార్టీ శాఖలన్నీ ఉద్యమాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సమావేశంలో తీర్మానం ఆమోదించారు. కాంగ్రెస్‌ ముఠా కుమ్ములాటల్లో మునిగిపోయి పరిపాలనను విస్మరించింది, ప్రజా సమస్యల పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించింది. స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశానికి జి.నాగయ్య, సి.రాములు, డాక్టర్‌ ప్రసూన అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. రాష్ట్రంలో గత సంవత్సరం 878 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడి 85 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొంది. పంటలు నష్టపోయినవారికి రూ.1800 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ''ప్రజాపథం''లో చెల్లిస్తామని

ప్రభుత్వం ప్రకటించి, చివరకు ఉప ఎన్నికల సందర్భంగా వచ్చిన కోడ్‌ కారణంగా పంపిణీ చేయలేక పోతున్నామన్నారని

విమర్శించింది. ''ప్రజాపథం''లో తాగునీటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. విద్యుత్‌కోతతో మంచినీటి పంప్‌సెట్లు పనిచేయడం లేదు. తీవ్ర కరువు వల్ల లక్షలాది వ్యవసాయ కార్మికులు పనులు లేక వలసలు పోతున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చేసిన కృషి నామమాత్రమని విమర్శించింది.

పెంచిన విద్యుత్‌ ఛార్జీల బిల్లులు వస్తున్నాయి. వినియోగదారుడు భారాలు భరించలేకుండా ఉన్నాడని పేర్కొంది. పంటల ధరలు పూర్తిగా పడిపోయాయి. పత్తి, మిరప, పసుపు ధరలు హీనస్థాయికి పడిపోయాయి. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఇసుక తవ్వకాల నిలిపివేతతో భవన నిర్మాణ రంగం పూర్తిగా నిలిచిపోయిందని తెలిపింది. 40 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని పేర్కొంది. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు హెల్త్‌కార్డుల కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించింది. జెన్‌ఎన్‌ఎన్‌యుఆర్‌ఎం 13వ ఆర్థిక సంఘం గ్రాంట్ల పేరుతో పట్టణాల్లో పన్నులు, ఫీజుల భారాలు పెంచింది. నీటి ఛార్జీలు, చెత్తపన్ను, యూజర్‌ ఛార్జీలు పెంచారని పేర్కొంది. కాంట్రాక్టు కార్మికులకు జీవో నెం.11, ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు జీవో నెం.3ను అమలు చేయడం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదో వేతన సంఘం నియామకం చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. మాల్స్‌లో పని గంటల అమలు, భోజన విరామ సమయం మార్పు, జీతాల చెల్లింపు కాల నిర్ణయం లేకపోవడం లాంటి 4 అంశాలపై వ్యాపారులకు అనుకూలమైన నిర్ణయాలను ప్రభుత్వం చేసింది. దీని వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి రక్షణ లేని స్థితికి నెట్టబడ్డారని విమర్శించింది.

దళితులపైన, రజకులపైన వివక్ష, దాడులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. దాడులకు పాల్పడ్డ వారిపై ఎలాంటి చర్యలూ లేవు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మహిళా కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించలేదు. సబ్‌ప్లాన్‌ నిధులపై ఒకవైపు ఆందోళన సాగుతున్నా, మరోవైపు వేలకోట్లు నిధుల మళ్లింపు జరుగుతూనే ఉందని సమావేశం తెలిపింది. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని, అభివృద్ది పేరుతో ఉపాధి కోల్పోయిన మత్య్సకారులు, నిర్వాసితుల ఆందోళనపై నిర్బంధం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రానికి, సోంపేట, కాకరాపల్లి ధర్మల్‌ కేంద్రాలకు అనుమతులు వచ్చాయన్న ప్రచారంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపింది. క్షౌర వృత్తిదారులపై పన్నులు పెంచడంతోపాటు, సైన్‌బోర్డులపై పన్నులు వేస్తున్నారు. వృత్తి కళాకారుల పెన్షన్లను నిలుపుదల చేశారు. గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘాలకు నాబార్డ్‌, ఎన్‌సిడిసి సంస్థలు రుణాలు ఇస్తామని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో పథకాలు అమలు కావడంలేదు. ఆర్టీసీ ప్రయివేటీకరణకు రంగం సిద్ధం చేస్తోందని విమర్శించింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. 2006-11లో భూముల పందేరంలో అక్రమ రాయితీలు ఇచ్చినట్లు, జలయజ్ఞంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ''కాగ్‌'' రిపోర్టు బహిర్గత పరిచిందని తెలిపింది. మద్యం సిండికేట్లలో, గనుల మాఫియాల్లో ప్రభుత్వ నేతల అవినీతిని బట్టబయలు చేస్తున్న అధికారులను బదిలీ చేశారని తెలిపింది. ఆరుగురు మంత్రులకు, ఎనిమిది మంది ఐఎఎస్‌ అధికారులకు సుప్రీంకోర్టు సంజాయిషీ నోటీసులు ఇచ్చిందని పేర్కొంది. కాంగ్రెస్‌లో ముఠాల మధ్య కుమ్ములాటలు తీవ్రంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు మధ్య తగాదా తీవ్ర స్థాయికి చేరింది. వీరిని ఢిల్లీకి పిలిపించి అధిష్టానం మందలించినా పరిస్థితి మెరుగుపడలేదు. కొంతమంది మంత్రులు, శాసనసభ్యులు Publiture