సవాళ్లను స్వీకరిస్తేనే విజయం

సవాళ్లను బాధ్యతతో స్వీకరిస్తేనే విజయం వరిస్తోందని ఎపి రాష్ట్ర ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ రామలింగం అన్నారు. బుధవారం గాయత్రి పరిషత్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభివృద్ధి కేంద్రం నిర్వహించిన ఇంజనీరింగ్‌ విద్యార్థుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ పనిచేయాలని, అప్పుడే రాణింపు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు అందిస్తున్న పలు స్వయం ఉపాధి పథకాలు గురించి వివరించారు. ప్రభుత్వ సూక్ష్మ చిన్న, మధ్య తరహా ఆర్థికసంస్థ ముఖ్య అధికారి రఘరామ్‌ మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే కొత్త ఆలోచనలు తప్పనిసరి అన్నారు. సమయస్ఫూర్తి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిపుణులు ప్రవీణ్‌ సంకల, జిల్లా పరిశ్రమల కేందం ఉప డైరెక్టర్‌ టి.జయబాబు, కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.వీరభధ్రరావు, సంస్థ డైరెక్టర్‌ పి.వెంకటరావు, రాష్ట్ర పరిశ్రమల సాంకేతిక అభివృద్ధి మండలి ప్రాంతీయ అధికారి ఎం.వరప్రసాద్‌, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్