ఎంపీకి జెడ్‌పిటిసి సభ్యులు సురేంద్ర వినతి

మండలంలోని గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని అరకు ఎంపీ కిషోర్‌ చంద్రదేవ్‌కు వినతి పత్రాన్ని సమర్పించినట్లు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు, జెడ్‌పిటిసి సభ్యులు కిల్లొ. సురేంద్ర తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లుతో మాట్లాడుతూ మండలంలోని ఆరు పంచాయతీలకు ఉపయోగపడే లివిటిపుట్టు సమీపాన ఉన్న నారింగ్‌జోడి వంతెన నిర్మించాన్నారు. ఆదేవిధంగా కొర్రాయి జంక్షన్‌ నుండి గసభ వరకు తారురోడ్డు నిర్మాణంతో పాటు, కించుమండలో గల పెద్దగెడ్డ వద్ద వంతెన నిర్మించాలన్నారు. అలాగే మంచినీటి సౌకర్యార్థం మంజూరైన రూ.2కోట్లతో మండలంలోని బల్లుగుడ, సంతవలస, డుంబ్రిగుడ, పంతలచింతగ్రామాల్లో మంచినీటి వసతి కల్పించాలన్నారు. ఈవిధంగా పలు సమస్యలపై వినతిపత్రంలో పేర్కొన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిజిఎస్‌ మండల కార్యదర్శి పి.సత్యనారాయణ, పి.బాలదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్