'పెన్షనర్లకు జీవో వర్తించాలి'

ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పిఆర్‌సి ఉత్తర్వులు వచ్చినా, పెన్షన్‌దారులకు వర్తించేలా జీవోలను విడుదల చేయాలని యలమంచిలి నియోజిక వర్గ పెన్షనర్ల అధ్యక్షులు సోమేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంచిన వెంటనే పెన్షన్‌దారులకు కూడా పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేయడం ఆనవాయితీయన్నారు. ప్రభుత్వోద్యోగులతో పాటు పింఛనుదారులకు కూడా 39 శాతం ఫిట్‌మెంట్‌ వర్తిస్తుంది. ప్రభుత్వఉద్యోగుల వేతన స్థిరీకరణకు పింఛనుదారుల వేతన స్థిరీకరణను చాలా తేడాలుంటాయి. పింఛనుదారుల మూల వేతనంపై ఫిట్‌మెంట్‌, జూలై 2008కు ఉన్న డిఎ 42.39శాతం కలిపి ఫెన్షను లెక్కిస్తారు. దీంతో పింఛనుదారులు వేచి చూడనవసరం లేదు. పెన్షనర్లకు పిఆర్‌సి ఉత్తర్వులు ఇస్తే వెంటనే అమలులో వస్తుందన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో భారం పడకూడదన్న ఉద్దేశ్యంతో కావాలనే జాప్యం చేయడం అన్యాయమని అధ్యక్షులు సోమేశ్వరరావు విలేఖరులకు తెలిపారు. కావున ఫించనుదారులు కేవలం పేన్షన్‌పై తప్ప మరేఇతర లాభాలు లేనందున ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే పిఆర్‌సి ఉత్తర్వులను పెన్షనర్లకు వర్తించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో రామచంద్రరావు , భాస్కరరావు, రిటైడ్‌ ఎఎంలు, డిఇలు, గుమస్తాలు పాల్గొన్నారు

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్