గిరిజన ప్రాంతంలో మలేరియాను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని గిరిజనసంక్షేమ శాఖ మంత్రి బాలరాజు తెలిపారు. కరకపుట్టులోని గిరిజనులకు దోమ తెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో ప్రతి ఏడాదీ మలేరియాతో వందలాది మంది గిరిజనులు మృత్యువాతపడుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మలేరియా అదుపునకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 10లక్షల దోమతెరలను గిరిజనులకు పంపిణీ చేస్తామన్నారు. పాడేరు ఏజెన్సీకి 3.866లక్షల దోమ తెరలు ఇవ్వనున్నామన్నారు. కుటుంబంలోని సంఖ్యను బట్టి మూడు వరకూ దోమతెరలు ఇవ్వనున్నామన్నారు. గిరిజనులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు ఇస్తామన్నారు. పంట నష్టం వాటిల్లిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రుణాలు ఇస్తామని, అలాగే స్త్రీశక్తి భవనాల ఏర్పాటు, మంచి నీరు, విద్యుత్, రోడ్లు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మన్యంలో చేపట్టనున్నామన్నారు. అనంతరం 2010-11సంవత్సరంలో లింగాపుట్టులో వ్యాధుల బారినపడి మృతి చెందిన 21 గిరిజన కుటుంబీకులకు రూ.20వేల చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం దోమతెరల అవగాహనా పోస్టర్లను విడుదల చేశారు. ఇరడాపల్లి పంచాయతీ పిఎల్ రోడ్డు నుండి బొడ్డపుట్టు వరకూ చేపట్టనున్న తారురోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ కె.శ్రీకాంత్ ప్రభాకర్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి, ఐకెపి ఎపిడి వెంకటరావు, కాంగ్రెస్ పార్టి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సతీష్‌వర్మ, మలేరియా డిఎం ప్రసాద్‌రావు, డిఎం అండ్ హెచ్‌ఓ సావిత్రి, ఎడిఎం అండ్ హెచ్‌ఓ మోహన్‌రావు, పిఆర్‌ఇఇ రణదేవ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఉషారాణి, ఎపిపి రమణమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాంగి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
java.lang.NullPointerException