కృష్ణలంక 5వ నంబరు జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సిగల్ లైట్లు, బ్లింకర్లు ఏర్పాటు చేయాలని 23వ డివిజన్ కార్పొరేటర్ దోనేపూడి కాశీనాథ్ సంబందిత అధికారులను డిమాండ్ చేశారు. బందరు లాకుల సెంటరు నుండి స్క్రూబ్రిడ్జ్ వరకూ ఐదు చోట్ల కృష్ణలంక ఎన్‌హెచ్ 5పై సిగల్ లైట్లు, బ్లింకర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ పైర్‌స్టేషన్ సెంటరులో బుధవారం ధర్నా, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ కృష్ణలంక జాతీయ రహదారిపై తరచూ ప్రమా దాలు సంభవిస్తున్నాయని, ఈ నెపద్యంలోనే ఇక్కడ ఏడాదికి 8 నుండి 15 మంది వరకూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. 5వ జతీయ రహదారిపై సిగల్ లైట్లు, బ్లింకర్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ నగర పాలక సంస్థ కౌన్సిల్‌లో తీర్మానం కూడా ఆమోదించడం జరిగిందన్నా రు. అంతే కాక ఈ విషయమై గత నెల 4న నంబురు 315 తీర్మానం చేయటంతో పాటు అందుకు అవసరమైన నిధులను నగర పాలక సంస్థ నుండి ఇచ్చేవిధంగా ఆమోదించటంతో పాటు ఒక లేకను ట్రాఫిక్ ఎసిపికి పంపడం జరిగిందన్నారు. ఈ నెపధ్యంలో నగరపాలక సంస్థచే అయ్యేవ్యయం రూ.12 లక్షలు బరిం చేందుకు లికిత పూర్వకంగా ట్రాఫిక్ డిపార్ట్‌మెం ట్‌కు తెలపడం జరిగిందన్నారు. అనంతరం కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు పరిశీలన జరిపారు. అయితే తదుపరి చర్యలు తీసుకున్న దాకలాలు కనిపించలేదు. ఇది జరిగిన నెలలోపు లయోలా కాలేజి డిగ్రీ పైనల్ ఇయర్ చదువుతున్న అశోక్ పైర్‌స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాంలో మృతిచెందాడు. ఇంత జరిగినా సంబందిత అధికారులు స్పందించక పోవటంతో ధర్నా నిర్వహించి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 600 సంతకాలను సేకరించినట్లు తెలిపారు. సేకరించిన సంతకాలను సంబందిత అధికారులకు అందజేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వి రంగారావు, కె భాను, సిహెచ్ కోటేశ్వరరావు, కె లక్ష్మణ, కె అంకుర్, రామకృష్ణ, చెన్నకేశవులు, విజరు, ఎన్ పధ్మ, ఎం సరోజిని, కె శివమ్మ, తదితరులు పాల్గొన్నారు.