రామలింగేశ్వరనగర్‌లో చలివేంద్రం ప్రారంభం

పుచ్చలపల్లి సుందరయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా సిపిఎం 14వ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో రామలింగేశ్వరనగర్‌ పడవలరేవు వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. చలివేంద్రాన్ని ప్రారంభించిన ఐద్వా డివిజన్‌ నాయకులు ఎన్‌.లక్ష్మీకుమారి మాట్లాడుతూ మంచినీటిని అందించాల్సిన ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకోవడంతో సిపిఎం ప్రజలకు చలివేంద్రం ద్వారా మంచినీటిని అందిస్తున్నట్లు తెలిపారు. డివిజన్‌ కార్యదర్శి జికె ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన పుచ్చలపల్లి సుందరయ్య పలు సేవా కార్యక్రమాలు చేశారని, ఆ స్ఫూర్తితో ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా సిపిఎం పలు చేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా లింగంనేని ఛారిటబుల ట్రస్టు సహకారంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.శాంతి, దుర్గమ్మ, నాగేశ్వరమ్మ, నాంచారయ్య, కృష్ణా తదితరులు పాల్గొన్నారు.

"); -->