ఆస్తి పన్ను జిఓ కాపీలు దగ్ధం

ప్రజలపై భారాలు వేయమని ఎన్నికల ముందు వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు ప్రజలపై భారాలు వేస్తోందని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ విమర్శించారు. ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతూ సిపిఎం తూర్పుజోన్‌-2 కమిటీ ఆధ్వర్యంలో సర్కిల్‌-3 కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించి జిఓ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు మోయలేని భారాలతో సతమతం అవుతుంటే ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవడానికి ఆస్తి పన్ను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని రానున్న కాలంలో తగినరీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జోన్‌ కార్యదర్శి బి.నాగేశ్వరరావు, డికె ప్రసాద్‌, ఎల్‌విఎన్‌.మల్లేశ్వరి, ఎస్‌కె.మస్తాన్‌, ఎల్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

19వ డివిజన్‌లో...

ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనకు నిరసనగా 19వ డివిజన్‌ ఆధ్వర్యంలో స్థానిక పుష్ప హోటల్‌ సెంటర్‌లో మంగళవారం జిఓ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.జోగిరాజు మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో నగర ప్రజలపై వివిధ రూపాల్లో రూ.200కోట్లు భారం మోపారన్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులు, నగరపాలక సంస్థ పెంచిన పన్నులతో సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజలు సతమతం అవుతుంటే అది చాలదన్నట్లు ఆస్తిపన్ను పెంపుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కాజ సరోజ, బి.లక్ష్మణ, కె.గురుమూర్తి, కె.సౌరి, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Sorry

java.lang.NullPointerException