వచ్చే ఒలింపిక్స్‌లో టాప్‌ఫోర్‌లో భారత హాకీ జట్టు

  • ఒలింపియన్‌ ముఖేష్‌ కుమార్‌

2012 ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు నాలుగో స్థానంలో ఖచ్చితంగా ఉంటుందని ఒలింపియన్‌ ముకేష్‌ కుమార్‌ అన్నారు. నగరంలో జరుగుతున్న అంతర్‌ జిల్లాల హాకీ టోర్నమెంట్‌ సందర్భంగా క్రీడాకారులకు మెళకువలు నేర్పేందుకు ఆదివారం ఆయన నగరానికి విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం భారత హాకీ జట్టు మంచి ఫామ్‌లో ఉందన్నారు. ఒలింపిక్స్‌లో తప్పకుండా మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలుస్తుందన్నారు. ఒలింపిక్స్‌లో హాకీ జట్టు సెమీఫైనల్‌ వరకు వెళితే ఆట పట్ల విద్యా ర్థులకు ఆసక్తి కలుగుతుందన్నారు. ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌పై ఆడేవిధంగా ప్రభుత్వం ప్రోత్సహి ంచాలన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌ ఉందన్నారు. హాకీ గేమ్‌ను ప్రోత్సహించేందుకు విశాఖపట్నం, విజయవాడలో ప్రభుత్వం ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌లపై ఆడితే ఆటలోని మెళకువులు నేర్చకోవడంతో పాటు ఆట ఆడాలనే ఆసక్తి పెరుగుతుందన్నారు. ప్రస్తుతం హాకీ జట్టు ఫూల్‌ ఎ లో ఉందన్నారు. జర్మనీ, న్యూ జిలాండ్‌, కారొయా, బెల్జియం, నెదర్లాండ్‌తో పాటు భారత్‌ మంచి ఫామ్‌లో ఉందన్నారు. ఖచ్చితంగా ఒలింపిక్స్‌లో మంచి ఫలితాలను సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

స్పాన్లర్లు రావాలి...

హాకీ క్రీడకు స్పాన్సర్లు లేకపోవడం ఇబ్బందికరంగా ఉందన్నారు. స్పాన్సర్లు ముందుకొచ్చి క్రీడాకారులకు మ్యాచ్‌ ఫీజు ఇస్తే ఎక్కువ మంది హాకీ పట్ల ఆసక్తి చూపే అవకాశం ఉందన్నారు. గతంలో హాకీ క్రీడ ఎంతో బాగుండేదని కొన్ని లోపాల కారణంగా క్రీడ పూర్వ వైభవం కోల్పోయిందన్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి సహకారం అందిస్తే పూర్వ వైభవం వస్తుందన్నారు. హాకీ ఆంధ్రప్రదేశ్‌ సెక్రటరీ నిరంజన్‌ మాట్లాడుతూ హాకీలో మహిళా జట్టు మంచి ప్రతిభ చూపేందుకుగాను ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా జట్టును ప్రోత్సహించేందుకుగాను పలు పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే వచ్చే నెలలో హైదరాబాద్‌లో సీనియర్‌ మహిళా జాతీయ హాకీ పోటీలను నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కడప, విశాఖపట్నం, కాకినాడలో ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇరత ప్రాంతాలలో కూడా ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌లు ఏర్పాటు చేస్తే హాకీ క్రీడ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు దత్తు, డిఎస్‌సి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.