స్మైల్‌ దంత వైద్యశాలలో శాశ్వత పళ్ల సర్జరీ

నగరంలోని స్మైల్‌ దంత వైద్యశాలలో శాశ్వత పళ్ల సర్జరీ ద్వారా అరుదైన రికార్డు సాధించినట్లు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్‌ టిడి గోవర్థనరావు తెలిపారు. కస్తూరిబాయిపేటలోని స్మైల్‌ దంత వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వివరాలను తెలిపారు. ఇప్పటి వరకు మెట్రోపాలిటన్‌ నగరాలకే పరిమితమైన శాశ్వత పళ్ల సర్జరీని నగరంలోని స్మైల్‌ దంత వైద్యశాలలో నిర్వహించినట్లు తెలిపారు. నగరానికి చెందిన మల్లిఖార్జునరావు చిగుళ్లు, పిప్పి వ్యాధితో పళ్ల వరుసను పూర్తిగా కోల్పోయాడని తెలిపారు. ఇతను తమ ఆసుపత్రికి రాగా ఆల్‌ఆన్‌ ఫోర్‌ అనే టెక్నిక్‌ ద్వారా శాశ్వత పళ్ల బిగింపు ప్రక్రియను సర్జరీ ద్వారా అమర్చినట్లు తెలిపారు. తాము శాశ్వతంగా ఆల్‌ ఇన్‌ ఫోర్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ దంతాల సెట్‌ను అమర్చినట్లు తెలిపారు.