ఆ ఇళ్లల్లో నివశించాలంటే భయం..భయం

  • మూఢనమ్మకాలతో ఖాళీ అయిన కాలనీ

అంతరిక్షంలో సైతం నివాసం ఏర్పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న నేటి రోజుల్లో కూడా ప్రజలను మూఢ నమ్మకాల భయం వీడలేదు. వరుస మరణాలతో భయాందోళన చెందిన ప్రజలు ఆ కాలనీనే ఖాళీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

పట్టణానికి సమీపంలో గల లింగమ్మవలసలో ఐదేళ్ల కిందట కుంచమ్మ పేరంటాలుగా పిలవబడే స్థలంలో ఎస్సీలకు 18ఇళ్లు ప్రభుత్వం నిర్మించింది. ఈ ఇళ్లల్లో గృహప్రవేశాలు చేసిన దేవుడి బుచ్చమ్మ ఇంట్లో ముగ్గురు కుటుంబ సభ్యులు వరుసగా మృతి చెందారు.

సత్తి లచ్చమ్మ, భర్త పైడయ్య, సత్తి రాములు కళావతి, రాములమ్మ, ఎం.తవిటయ్య, చిన్నారావు ఇలా 10మంది వరకు వరుసగా మృత్యువాత పడ్డారు. ఆ స్థలంలో పుట్టలు, కుంచమ్మ పేరంటాలు గుండం తొలగించి ఆ స్థలంలో ఇళ్లు నిర్మించడం వల్లే వరుస మరణాలు సంభవించాయని వారి మూఢనమ్మకం. దీంతో కాలనీని ఖాళీ చేసి గ్రామంలోకి కొందరు వెళ్లగా మరికొంత మంది వలస వెళ్లిపోయారు. మూడేళ్లయినా ఇంతవరకు అక్కడకు ఎవరూ వెళ్లలేదు. ఇప్పటికీ వారిని భయం వీడడం లేదు. దీంతో లక్షలు పోసి నిర్మించిన ఇళ్లన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్