జిల్లాలోని జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల నియామకం గురువారం జరిగింది. జిల్లాలోని ఇప్పటికే శృంగవరపు కోట, లక్కవరపుకోట, మక్కువలు నియా మకాలు జరిగాయి. మిగిలిన 21మందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చి జిల్లాకు పంపారు. జిల్లా జలయాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గోపాలకృష్ణ వీరికి వివిధ మండలాలను కేటాయించారు. ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న పనులను సాంకేతిక సహాయ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు చేసిన పనులకు చెక్‌మెజర్‌మెంట్ చేస్తారు. పనుల్లో నాణ్యతను పరివీలించి, క్షేత్ర, సాంకేతిక సహాయకులకు సలహాలిస్తారు. రూ.2లక్షల్లోపు పనులకు ఆమోదాన్ని ఇస్తారు. నియమించిన వారిలో సింగంపల్లి విజయలక్ష్మి (జామి), ఎకె నజాముద్దీన్ (గుర్ల), మల్ల వినోద్‌కుమార్ (వేపాడ), వావిలపల్లి జగన్మోహనరావు (తెర్లాం), డి.జోగారావు (గరివిడి), ఎస్.జానకీరామునాయుడు (గంట్యాడ), కె.చిట్టిబాబు (పూసపాటిరేగ), డి.సుధాకర్ (డెంకాడ), వై.ఎస్. శ్రీనివాసనాయుడు (నెల్లిమర్ల), బి.సందీప్ (భోగాపురం), సిహెచ్.శ్రీనివాసరావు (పార్వతీపురం, బి.శ్రీనివాసరావు (బొండపల్లి), కె.రాజేంద్ర ప్రసాద్ (మెంటాడ), ఎల్‌బిబిఎస్ శివప్రసాద్ యాదవ్ (దత్తిరాజేరు), మహమ్మద్ ఖుర్షిద్ ఆలీ (బాడంగి), సిహెచ్.శ్రీకాంత్ (బొబ్బిలి), చిప్పగిరి (చీపురుపల్లి), కె.యుగేష్ (కొత్తవలస), ఎస్.రాచంద్రర్ (గజపతిన గరం), వి.బుజ్జి (సాలూరు) ఉన్నారు.
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైన సాంకేతిక సలహాదారులకు శిక్షణ
కొత్తగా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైన ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్లకు ఈనెల 12నుంచి వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు డ్వామా పీడీ గోపాలకృష్ణ చెప్పారు. సిఆర్‌డి, ఎస్‌ఆర్‌డిసి ఆధ్వర్యాన గతవారం సాలూరు, ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బిఎస్సీ చదువుతున్న విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. అక్కడ అర్హత పొందిన 39మందికి శిక్షణ ఇచ్చేందుకు ఉత్తర్వులు వచ్చాయన్నారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు చీపురుపల్లిలోని సిఎల్‌ఆర్‌సి కేంద్రంలో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం మండలా లను కేటాయిస్తామని చెప్పారు.