గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో చేర్పించాలని ఆశాఖ సహాయ సంక్షేమాధికారి పి.రత్నం కోరారు. బుధవారం స్థానిక ఎస్సీ వసతిగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. పిల్లలను హాస్టళ్లలో చేర్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికీ బృందాలుగా తిరుగుతున్నామని తెలిపారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక హాస్టల్ సంక్షేమాధికారి నిర్మల, విజయనగరం, అలమండ, పెదమజ్జిపాలెం హాస్టళ్ల సంక్షేమాధికారులు పాల్గొన్నారు.