జిల్లాలోని వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది పనిచేసే కేంద్రాల్లో వారం రోజుల్లోగా నివాసం ఏర్పర్చుకోపోతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టం చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో డిఎంహెచ్‌ఓ, ఆసుపత్రుల సమన్వయ అధికారితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనిచేసే కేంద్రాల్లో నివాసం ఏర్పర్చుకోని వైద్యాధికారులకు, శాశ్వత పారామెడికల్ సిబ్బందికి తొలుత గ్రామీణ అలవెన్స్, ఏజెన్సీ అలవెన్స్‌లను నిలుపు చేస్తామని అన్నారు. తరువాత దశలవారీ బదిలీ, సరెండర్ వంటి చర్యలు చేపడతామన్నారు. స్థానికంగా ఉండని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 76మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బంది స్థానికంగా నివాసం ఉండటం లేదని అన్నారు. వీరితో పాటు 12మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉన్నట్టు పేర్కొన్నారు. డిసిహెచ్‌ఎస్ విజయలక్ష్మి మాట్లాడుతూ భోగాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చెందిన నలుగురు వైద్యులు కూడా స్థానికంగా ఉండటం లేదని వివరిం చారు.
కేంద్రాసుపత్రిలో జనరేటర్ పునరుద్దరణ
జిల్లా కేంద్రాసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన జనరేటర్‌ను కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య బుధవారం ప్రారంభించారు. విద్యుత్ కోతవల్ల ఆసుపత్రిలో అందించే సేవలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధుల నుంచి రూ.5లక్షలతో 124 కెవిఎ సామర్ధ్యంగ జనరేటర్‌ను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇకపై ఆసుపత్రిలో సేవలకు విద్యుత్ అంతరాయాల వల్ల ఎటువంటి ఆటంకమూ ఉండబోదని అన్నారు. కార్యక్రమం లో ఏజేసి ఎం.రామారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామరాజు, డిసిహెచ్‌ఎస్ విజయలక్ష్మి, ఆర్‌ఎంఓ గౌరీశంకర్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.
java.lang.NullPointerException