'మీసేవ' నిర్వాహకులకు శిక్షణ

రెవెన్యూ సంబంధిత సేవలను సత్వరమే అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మీ-సేవా కేంద్రాల నిర్వహణపై నిర్వాహకులకు శుక్రవారం యూత్‌ హాస్టల్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్‌ ఎం.గణపతిరావు మాట్లాడుతూ కేంద్రాల గురించి వివరించారు. 15రకాల రెవెన్యూసేవలతో పాటు రిజిస్ట్రేషన్‌కు చెందిన రెండు సేవలు, విద్యుత్‌ బిల్లులు, ప్రవేశపరీక్షా ఆన్‌లైన్‌ దరఖాస్తులు, మొబైల్‌, డిటిహెచ్‌, రిఛార్జీలు ఈ కేంద్రాలకు అప్పగిస్తారని తెలి పారు. రాజీవ్‌ ఇంటర్నెట్‌ విలేజ్‌, ఎపి ఆన్‌లైన్‌, పట్టణ ఇ-సేవలు అందించే కేంద్రా లన్నీ ఇకపై మీ-సేవా కేంద్రాలుగా మారుతా యని తెలిపారు. జిల్లాలో 213 కేంద్రాలకు గాను తొలి విడతగా 49 కేంద్రాలు ప్రారంభమ వుతా యని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కేంద్రాలు తెరిచే అవకాశం ఉందన్నారు. సాంకేతిక అంశాలపై మేనేజర్‌ ఆర్‌డి పాత్రో వివరించారు.

Publiture