అక్రమ తవ్వకాలైనా, ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనుకున్నా స్థానిక రెవెన్యూ అధికారులకు, సిబ్బంది చేతులు తడిపితే పనులు గుప్‌చప్‌గా జరిగిపోతాయి. ఇదీ ఈ మండలంలోని రెవెన్యూ అధికారుల నిర్వాహకం. రైల్వే మూడోలైను పనుల నిమిత్తం కొన్నేళ్లుగా భీమసింగి, కుమరాం, మోకాస కొత్తవలస, బలరాంపురం ప్రాంతాల్లో మట్టిని ఉపయోగిస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కారుచౌకగా నదీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమతవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల కాంట్రాక్టరుకు జేబులైతే నిండుతాయి గానీ భూగర్భ జలాలు అడుగంటి సమీప గ్రామస్తులకు నీటి సమస్య ఏర్పడుతుంది. నదీలో గొయ్యిలు ఏర్పడి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి. గత 15రోజులుగా రైల్వే బ్రిడ్జికి సమీపాను ప్రొక్లెన్లతో తవ్వకాలు జరుపుతున్నారు. బ్రిడ్జిఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరాన తవ్వకాలు జరిపితే బ్రిడ్జి నిర్మాణానికి ప్రమాదం వాటిల్లే అవకాశముంది. నిబంధనల ప్రకారం తవ్వకానికి వీలున్న ప్రాంతాల్లో అధికారుల అనుమతులతో మట్టిని తీయాలి. అయితే కాంట్రాక్టురుకు ఖర్చు పెరుగుతుంది. దీంతో సమీప ప్రాంతాల్లో రైతులకు ఎంతోకొంత ముట్టచెప్పి ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ సిబ్బంది అండదండలతో తవ్వకాలు జరుపుతున్నారు. ఇదంతా స్థానికంగా ఉన్న బడాబాబుల కనుసన్నల్లోనే జరుగుతుండడంతో అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
తవ్వకాలను ఆపేస్తా : తహశీల్దార్
అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేస్తామని తహశీల్దార్ ఎం.రాజేశ్వరి తెలిపారు. తవ్వకాల విషయమై తన దృష్టి కారాలేదన్నారు.
java.lang.NullPointerException