తల్లిదండ్రులు బాధ్యతగా మెలగాల్సిన సమయం
పరీక్షలు ప్రకటించింది మొదలు పిల్లలకు భయంగా వుంటుంది. తల్లిదండ్రులు బాధ్యతగా మెలగవలసిన సమయం. పిల్లలను తెల్లవారుజామున నిద్రనుంచి మేల్కొలిపి వారిని చదివించాలి. టివిలకు, సినిమాలకు, షికార్లకూ దూరంగా వుంచాలి. ముందుగా ఏ పరీక్షలు వుంటాయో... ఆ పరీక్షలకు, దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులను సిద్ధంచేయాలి. వారిలో వున్న భయాన్ని పోగొట్టాలి. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ప్రోత్సహించాలి. మంచి మార్కులు వస్తే నీకు మంచి బహుమతి యిస్తామని చెప్పాలి. కోచింగ్‌సెంటర్స్‌కు దూరంగా వుంచాలి. వారి స్నేహితులను కూడా గమనిస్తూ వుండాలి. వారు తెలియక ఏదైనా తప్పుచేసినా సున్నితంగా మందలించాలి.
- ఎస్.ఎ. కరీం, తెనాలి.
క్కని పోషకాహారం
టీవీలు, ఆటలు ఏడాది మొత్తం ఉండేవే! పరీక్షలు ఉన్నప్పుడు విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టాలి. పిల్లలకు అర్థంకానివి తల్లిదండ్రులు ఓపిగ్గా వివరించాలి. వారిని చదువుకొమ్మని తల్లిదండ్రులు టివి చూడకూడదు. పోషకాహారం అందించాలి. మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి. విద్యార్థులు సరిపడా నిద్రపోవాలి. రాత్రంతా మేలుకొని చదవడంవల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువ. ఇప్పుడు కొద్దిగా కష్టపడితే తరువాత సెలవుల్లో చక్కగా ఆడుకోవచ్చని చెప్పాలి. అంతేకాదు, మంచి మార్కులొస్తే కొత్త తరగతికి వెళ్తారని చెప్పాలి. కొట్టి, తిట్టడాలు అస్సలు కూడదు. మెల్లగా నచ్చచెప్పి ప్రోత్సహిస్తేనే మంచి ప్రయోజనం వుంటుందని తల్లిదండ్రులు మరవరాదు.
-కె. సులోచన, శారాజీపేట్.
ఈవారం ప్రశ్న:
- షాపింగ్ సరదానా లేక వ్యసనమా?
మా చిరునామా:
ఇలా చేస్తే?!
ఆమె, ప్రజాశక్తి,
ఎంహెచ్ భవన్,
21/1, ఆజమాబాద్,
హైదరాబాద్- 20.