
డా|| నాగినేని భాస్కరరావు
వృద్ధుల వైద్యనిపుణులు
ఎంఎన్‌ఆర్
వైద్య కళాశాల ,
ఆసుపత్రి సంగారెడ్డి.
ఫోన్ 94402 26008
వృద్ధుల్లో వినికిడి కోల్పోవ టానికి కారణా లను తెలుసుకోవాలి. అంటే చెవి, ముక్కు, గొంతు, వైద్య నిపుణున్ని సంప్రదించాలి. చెవుడు ప్రసారలోపం వల్ల వచ్చిందా లేక వినికిడి నరం దెబ్బ తినటం వల్ల వచ్చిందా? అని తెలుసుకోవాలి. వైద్య నిపుణుని సలహా మేరకు తగిన చికిత్స, సహకారాలు తీసుకోవాలి. గుబిలి వల్ల, ఇతర పదార్థాల వల్ల వెలుపలి చెవి కాలువ వూడుకు పోతుంది. దీంతో శబ్ధ తరంగాల ప్రసారానికి ఆటంకం ఏర్పడినపుడు చెవిని శుభ్రం చేసి, ఇంకా ఏమైనా వ్యాధిగ్రస్తత ఉంటే తగిన మందులతో నయం చేసుకొని వినికిడిని తిరిగి (కొంతైనా) తెచ్చుకోవచ్చు.
కర్ణభేరి పగిలిపోవటం : ఏ కారణంతోనైనా కర్ణభేరి పగిలిపోతే చెవి, ముక్కు గొంతు వైద్య నిపుణుని సంప్రదించి తగు చికిత్స శస్త్రచికిత్స చేయించుకోవాలి. చికిత్సకు ముందు డాక్టరు దగ్గరకు వెళ్లే ముందు చెవిలో ఏ మందు చుక్కలు వేయరాదు.
ఆడియెమెట్రీ : ఈ పద్ధతి ద్వారా వినికిడిలోపం చెవుడు సమాచారం తెలుసుకుంటారు. ఆ తరువాత వినికిడి సహాయకారులను సంబంధిత నిపుణుని సలహా మేరకు కొనుక్కోవాలి.
వినికిడి సహాయకారులు
వినికిడి కోల్పోయిన వృద్ధులు తమ జీవనాన్ని సాధారణ ంగా కొనసాగించేందుకు, ఇతరు లు మాట్లాడుతున్న సంభాషణలను విని అర్థం చేసుకోవడానికి, చుట్టు పక్కల ఇతర శబ్ధాలను విని అర్థం చేసుకుని రోజువారీ జీవితాన్ని కొనసాగించేందుకు ఈ సహాయ కారులను ఉపయోగించవచ్చు. చెవికి ఎక్కువ ధ్వనిని తీసుకురావటమే వినికిడి సహయకారుల ముఖ్య ధర్మం. అన్ని పరీక్షలు చేయించుకుని, ఆడియోగ్రాం కూడా చేయించుకోవాలి. డాక్టరు సలహాతో వినికిడి సహాయకారులను చెవిటి వృద్ధులు ఉపయోగించాలి. నాలుగు రకాల వినికిడి సహాయకారులు ఎక్కువగా వాడుతున్నారు. చెవి వెనకపెట్టుకునేవి, చెవిలో పెట్టుకునేవి, కళ్లజోళ్లకుండేవి, జేబులో పెట్టుకునేది. వీటి వల్ల బాధిత వృద్ధులు కొంత మేలుపొంది తమ పనులను తామే చేసుకోగలరు. వినికిడి సహాయకారులు మూడు రకాలు. సమాన పోలికలుగల సాంకేతిక నైపుణ్యంపై ఆధారపడినవి మొదటి రకానికి చెందినవి. ఇవి చాలకాలం నుండి వాడబడుతున్నవి. చౌక కూడా. ఇక రెండో రకంలో సగం-ద్విసంఖ్యా పద్ధతిలో సూచితమైన విద్యుత్ సంకేతాల ద్వారా ఆధారపడ్డవి. సాంకేతిక నైపుణ్యంతో కొంత వరకు కంప్యూటరు కార్యక్రమం ద్వారా నిర్ణయించబడ్డ వినికిడి సహాయకారి. ఇది వ్యక్తి వినికిడి లోపాన్ని అనుసరించి వుంటుంది. ద్విసంఖ్యా పద్ధతిలో సూచిత విద్యుత్ రోగి వినికిడి లోపానికి సరిపడిన నిర్ణయించిన వినికిడి సహాయకారి ఆటోమేటిక్ కంట్రోలు కలది. చాలా ఖరీదైనది. వీటికి తోడు కొత్త రకం అందుబాటులో ఉంది. దీన్ని ఏకంగా చిన్న శస్త్ర చికిత్స ద్వారా చెవిలోనే అమర్చే వీలుంది. దీనిపేరు కోఖ్లియార్ ఇంప్లాంట్. ఇది చాల ఖరీదైనది.
కొన్ని సమస్యలు
కళ్లు తిరగడటం, పడిపోవటం వృద్ధుల్లో సాధారణం. శరీరం స్థితి సమతూకానికి లోపలి చెవిలోని వెస్టిబ్యూలు సమాచారం, దృష్టి సంబంధ, శరీర స్పర్శ సంబంధ వ్యవస్థలు కలిసిన క్లిష్టమైన వ్యవస్థ నియంత్రణ అవసరం. వయస్సు మీరటం వల్ల ఈ మూడు వ్యవస్థల్లో పనితీరు తగ్గిపోతుంది. మెదడు వీటిని సమన్వయం చేయకపోవటంవల్ల వృద్ధులు శరీర సమతూకం పాటించుకోలేక పడిపోతుంటారు. దీనితో వృద్ధులు కళ్ళు తిరగటం లేక తల తిప్పటాన్ని నిలువలేక పోతారు. సమతూకాన్ని పాటించలేకపోవటం, తల బరువు తేలికగా వుండి నిస్త్రాణగా వుండటం, లేక ఖచ్చితంగా తిరుగుతున్నట్లుగా భావించటం, మొదలగు లక్షణాలను సమస్యలను చెప్తారు.
తలతిప్పుడు
తల తిప్పటం కదలిక తప్పుడు గ్రహణశక్తి. గిరగిర తిరుగుతున్నట్లు భావన. వాంతి వచ్చినట్లు వుండటం. వాంతి కావటం. ఈ తల తిప్పటం పరిధీయా కావచ్చు లేదా కేంద్ర లేక భాషపరమైన జబ్బువల్ల కావచ్చు. పరిధీయ తల తిప్పటం చాల తీవ్రంగా వుంటుంది. వాంతి అవుతుంది. కేంద్రీయ తల త్రిప్పటం, అంత తీవ్రంగా వుండదు.
చికిత్స : తలతిప్పటం వాంతులతో కూడుకున్నది కాబట్టి రోగికి జబ్బు గురించి చెప్పాలి. కొన్ని మందులను డాక్టరు సలహామేరకు వాడువచ్చు.ఇలా చెవికి సంబంధించిన సమస్యలను వృద్ధాప్యంలో వారిని పీడిస్తాయి. తగు జాగ్రత్తలు, నివారణ చర్యలు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
తీపి పదార్థాన్ని తినటం
సోయా గింజలతో తయారయ్యే ఆహార పదార్థాలను తినటం ఆసియా ఖండంలో 3000 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. సోయాపాలు, సోయాతో తయారయ్యే తీపి పదార్థాలను శాకాహారులు ఎక్కువగా ఇష్టపడతారు. వీటిలో కొలెస్టరాల్ అసలుండదు. ఎక్కువగా మాంసకృత్తులు వుంటాయి. కాల్షియం, ఇనుము వుంటాయి. ఈ తీపి పదార్థాన్ని వండిన తరువాత ఆహారంలో ఒక 'హీరో' వంటిది. మాంసానికి బదులు శాకాహారులు దీనిని తినవచ్చు. కొవ్వును తగ్గించుకోవడానికి సోయా గింజలతో తయరుచేసిన ఈ తీపిపదార్థాన్ని తినొచ్చు. మార్కెట్టులో సోయాగింజలు లభిస్తాయి.
సోయాపిండిని గోధుమపిండితో కూడా కలిపి వాడవచ్చు. సూపర్ మార్కెట్లలో సోయా తీపిపదార్థంలభిస్తుంది. మధుమేహా వ్యాధిగ్రస్తులు సోయాగింజల పిండిని వాడితే మంచిది (తీపికాకుండా).