అమెరికా నుంచి వయోజన విద్య, ఇజ్రాయిల్ హార్టికల్చర్, బ్రెజిల్ ఆరోగ్య విధానాలు, చిలీ విద్యుత్ సంస్కరణలు, థారులాండ్ షౌల్ట్రీని మన దేశంలో ప్రవేశపెట్టారు. ఇజ్రాయిల్ వ్యవసాయ నమూనా కుప్పంలో ఎలా వైఫల్యం చెందింది మనం చూశాం. సమాజ నేపథ్యానికి, పథకాల రూపకల్పనకు ఉండవలసిన గతితార్కికతను అవగాహన చేసుకోకుండా బలవంతంగా రుద్దిన విదేశీ ఆర్థిక నమూనాల వల్ల మన దేశ ఆర్థికవ్యవస్థ అతుకుల బొంత అయ్యింది.
స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు అయింది. 12 పంచవర్ష ప్రణాళికలు రూపొందించారు. ప్రపంచీ కరణ వేగవంతం కావడంతో సరళీకరణ ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. సరుకులకు గిరాకీని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా విధానాలు ఉంటాయని కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లూవాలియా ప్రకటించారు. వ్యవసాయర, పరిశ్రమలు, సేవారంగాల మధ్య వ్యవస్థాగత సమతు ల్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. అయితే ఈ రంగాల మధ్య వైరుధ్యాలు తీవ్రమపుతూ పేదరికాన్ని పెంచుతున్నాయి. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల ఆర్థిక నమూనాను మనదేశంలో పాలకవర్గం అవలంబిస్తోంది. ఆ దేశాలలో వ్యవసాయం మీద ఆధారపడే ప్రజల శాతం 10 కన్నా తక్కువే. మన దేశంలో వ్యవసాయరంగంపై 65 శాతం పైగా జనాభా ఆధారపడుతున్నారు. పరిశ్రమల రంగంపై 35 శాతం, సేవల రంగంపై 5 శాతం ఆధారపడుతున్నారు. జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా 14 శాతం, పరిశ్రమలు, అనుబంధ సంస్థల వాటా 26 శాతం, సేవల రంగం 60 శాతంగా ఉంది. ఆదాయం ఎక్కువగా పొందుతున్న సేవల రంగం ఉపాధిని కల్పించింది 5 శాతమే. ఆదాయం పంచుకోవడంలో తీవ్ర అంతరాలు ఏర్పడ్డాయి. రూ.60 ఆదాయాన్ని నూటికి ఐదుగురు, రూ.26 ఆదాయాన్ని 35 మంది, రూ.14 ఆదాయాన్ని 60 మంది పంచుకుంటున్నారు. అభివృద్ధి ఫలాలు ధనికుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి.
జనాభాలో 40 శాతం పైగా పేదరికంలో ఉన్నారు. మార్కెట్లో సరుకులు ఎగువ మధ్యతరగతికి, ధనవంతులకు ఉపయోగపడేవే ఎక్కువుగా ఉన్నాయి. ఈ జనాభా 10 శాతం మాత్రమే. మిగతా 90 శాతం మందికి అందే విధంగా మార్కెట్ విస్తృతి పెరగడం లేదు. దీనికి కారణం వీరి కొనుగోలు శక్తి అధమ స్థాయికి పడిపోవడమే. జిడిపిలో 50 శాతం నల్లధనముందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటి లావాదేవీలు అసంఘటిత రంగంలో బలంగా ఉంటాయి. ఇది చట్టపరిధిలోకి రాని రంగం. లక్ష కోట్ల రూపాయల నల్లధనం స్విస్‌బ్యాంకుల్లో మూలుగుతున్నట్లు ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ప్రకృతి సహజవనరులపై ఆధిపత్యం సొంతం చేసుకుంటున్న లంపెన్ కార్పొరేట్ వర్గం గత మూడు సంవత్సరాలుగా రాజ్యాంగేతర శక్తిగా అవతరించింది. రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. ప్రైవేట్ ఆర్థికవ్యవస్థ ఆభివృద్ధి అవుతూ, నేరపూరిత రాజకీయాలను తయారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ఇది అవినీతిని, హింసను వ్యవస్థీకృతం చేసింది.
పెట్టుబడి, శ్రమకు ఉన్న వైరుధ్యాలు వ్యవసాయ, పరిశ్రమ, సేవల రంగాల మధ్య వైరుధ్యాలుగా బదిలీ అవుతున్నాయి. ఇవి ప్రజల, ప్రాంతాల, కులాల మధ్య ఘర్షణలుగా మారుతున్నాయి. గతంలో ఆర్థిక అభివృద్ధి రేటు 9.5 శాతం ఉంటే, ఇప్పుడు 6.9 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలు సంక్షోభంలో పడ్డాయి. మన విదేశీ అప్పు 33,500 కోట్ల డాలర్లకు చేరింది. బ్యాంకులకు రూ.2 లక్షల కోట్లు బడా కంపెనీలు ఎగ్గొట్టాయని ద్రవ్యసంస్థలు పేర్కొంటున్నాయి. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 60 నుంచి 46 శాతానికి పడిపోయింది. పొదుపును 37 శాతం నుంచి 32 శాతానికి కుదించారు. బడ్జెట్‌లోటు 4.9 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. ప్రతి భారతీయుడి తలపై లక్ష రూపాయల పైనే అప్పు ఉంది. తలసరి ఆహార ధాన్యాల లభ్యత 1990లో 510 గ్రాములుంటే 2010లో 440 గ్రాములకు దిగజారింది. వ్యవసాయంలో సంక్షోభాన్ని గత 5 సంవత్సరాల కాలంలో లక్షల సంఖ్యలో జరిగిన రైతు ఆత్మహత్యలు వ్యక్తీకరిస్తున్నాయి. సట్టా వ్యాపారం పూర్తిగా విదేశీ, స్వదేశీ మదుపుదార్ల చేతిలో చిక్కుకుపోయింది. ఉత్పాదకరంగాలలోకి పెట్టుబడి బదిలీ అయినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఆ దిశగా చర్యలులేవు.
వ్యవసాయం పూర్తిగా ప్రకృతికి అప్పగిం చబడటం, ఎరువుల ధరల పెరుగుదల, కరెంటు కోత, గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు వ్యవసాయాన్ని వదులు కోవాల్సివస్తోంది. ఒక్క గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్లనే భారతదేశ రైతులు రూ.1.25 లక్షల కోట్లు కోల్పోతున్నట్లు అంచనా. ఈ పెట్టుబడి దళారీల చేతుల్లోకి వెళ్లిపోయి తిరిగి వ్యవసాయంలోకి రావడంలేదు. సంవత్సరానికి రూ.20 లక్షల కోట్లు వ్యవసాయరంగం నుంచి వ్యాపారరంగానికి బదిలీ అవుతోంది. సెజ్‌ల పేరుతో గత 40 సంవత్సరాలలో 1.5 లక్షల చ.కి.మీ భూములు రైతుల నుండి పారిశ్రామికీకరణ కోసం లాక్కొన్నారని ఆస