మన పాలకులు మన ఇంజనీరింగ్ విద్యను సేవల రంగానికి పరిమితం చేసేశారు. ప్రపంచ బ్యాంకులు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. ఆ దిశలో డబ్బును కూడా పెద్ద ఎత్తున సమకూర్చుకోగలిగింది. మీరిచ్చే డబ్బు ఎంతైనా కానివ్వండి. కానీ మా విధానాలను మాత్రం కంట్రోల్ చేయబోమని స్పష్టంగా హామీ ఇవ్వాలని చైనా చెప్పింది. అలా చెప్పాకే ఇతర దేశాల దగ్గరనుంచి అప్పులు తీసుకుంది. అందువల్లనే చైనా తనదేశంలో అపారంగా వున్న మానవ వనరులతో ఉత్పత్తిని చేస్తుంది.
కొన్ని వర్గాల్లో శ్రమ ముడి పదార్థంగానే ఉంది. దాన్ని ఇంకా నవీనీకరణ చేయలేదు. శ్రమజీవులు చేస్తున్న పనిని ఆధునిక పద్ధతులను ఉపయోగించకుండా చేస్తే అది భారంగా ఉంటుంది. పారిశ్రామిక విప్లవాలు వచ్చిన తర్వాత దేశ దేశాల శ్రమల్లో మార్పులొచ్చాయి. ఈ మార్పులు శ్రమను తగ్గించటమే కాకుండా ఉత్పత్తిని పెంచే సాధనంగా కూడా మారాయి. అంటే యంత్రాలతో వచ్చిన మార్పులు కుప్పలు తెప్పలుగా ఉత్పత్తిని పెంచాయి. ఆ పెరిగిన ఉత్పత్తి వల్లనే అత్యధిక జనాభా అవసరాలను తీర్చగలిగింది. కాని మన దేశంలో శ్రామిక జీవుల, కుల వృత్తులను ఆధునీకరించటంలో చూపాల్సిన శ్రద్ధ చూపడం లేదు. దీనివల్ల శ్రమ పెరగటమే కాకుండా ఉత్పత్తి పరంగా కూడా వెనుకబడి పోతున్నాం. ఇతర దేశాలలో పాలనా అవసరాల కోసం, ఆయా దేశాల అభివృద్ధి కోసం తయారు చేసుకున్న ఇంజనీరింగ్ విద్యను మన పాలకులు ఇక్కడ మనకు నేర్పుతున్నారు. చైనా తన పునాదుల నుంచే తన విద్యారంగాన్ని రచించుకుంది. తన దేశ అవసరాలకు తన దేశంలో విస్తృతంగా ఉన్న మానవ వనరులను ఉపయోగించుకునేందుకు అవసరమైన సాంకేతిక విజ్ఞానాన్ని అది అభివృద్ధి చేసుకుంది. ఎక్కడ ఉత్పత్తి ఉంటుందో, అక్కడే శ్రమ జీవులుంటారు. అవే శ్రామిక శక్తులుగా నిలుస్తాయి. ఎక్కడ సేవల రంగం అభివృద్ది చెందుతుందో అక్కడ ఉద్యోగ, పాలనాపరమైన విద్య ఉంటుంది. కొన్ని దేశాలలో సేవల రంగానికి సంబంధించిన విద్య విస్తృతంగా ఉంది. ఆ విద్యను మన ఇంజనీరింగ్ విద్యలో ఎక్కువగా చొప్పించారు. చేపలు పట్టే దగ్గర టెక్నాలజీ అన్నది బెస్త జీవితాల్లో గర్భితమైంది. సర్వీసులను మాత్రమే చూస్తే ఉద్యోగానికే పరిమితం. ఆనాడు చదువు అన్నది పత్రాలు రాసేందుకే అవసరమైంది. కాని ఈనాడు చదువు రూపం మారింది. ఉత్పత్తి ఎక్కడైతే మొదలౌతుందో అది శ్రమజీవుల జీవితంతో ముడిపడి ఉంటుంది.
సర్వీసుల రంగమంతా వినియోగదారుని సేవలకే పరిమితమైంది. ఉత్పత్తిలో వినియోగదారునికి సంబంధం లేదు. వినియోగదారుడంటే తన కంపెనీలో పనిచేసే ఇంజనీర్ కావాలి. ఆ ఇంజనీర్ కావటానికి ఆయన పడ్డ బాధ అవసరం లేదు. తన కంపెనీలో సేవలు ఎలా చేస్తారో అది ముఖ్యం. శ్రమజీవి జీవితం ఉత్పత్తిని డామినేట్ చేస్తుంది. ఇండియాకు చైనాకు అదే తేడా అన్నది గమనించాలి. మనకు సర్వీసింగ్ ప్రధానం. అందుకు విద్యార్థులు సిద్ధపడాలి. చైనాలో ఉత్పత్తి రంగం బలంగా ఉంది. వాళ్ళకు ఉత్పత్తే ప్రధానమైంది. ఈ రెండు దేశాల మధ్య చదువులో కూడా తేడా ఉంది. శ్రమజీవుల జీవితాలను మెరుగుపరిచేందుకు చదువు కావాలి. ఆ కోణంలో ఆలోచించేందుకు ప్రయత్నించాలి. అప్పుడు అత్యధిక జనాభా వున్న దేశాలు తమ మానవ వనరులను విజయవంతంగా ఉపయోగించుకొని ఉత్పత్తిని పెంచుతాయి. ఈ ఆలోచన లేకపోతే మనం అవసరంలేని రంగాన్ని ఇక్కడ చదువుగా పెట్టుకొని ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు పరుగులు పెట్టాల్సిన స్థితి వస్తుంది. అందుకే మనదేశంలో వున్న సమస్త కులాల సమస్త వృత్తులను ఆధునీకరించాలి. అంటే వృత్తిదారులను దెబ్బతీసి పారిశ్రామిక యాంత్రాలను గ్రామాలపై రుద్దటం కాదు. ఏ వృత్తితో ఏ పని చేస్తున్నారో ఆ పనిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఏ వారసత్వంగా ఆ వృత్తుల నైపుణ్యంతో సంపదలు సృష్టిస్తూ వస్తున్నారో వాళ్లు స్వతంత్రంగా నిలబ డగలుగుతారు.
కంసాలి తన ఊపిరితి త్తులతో వూదుతాడు.
గ్యాస్‌తో మంట పెట్టవచ్చు కదా అన్నది యంత్రాల ద్వారా వచ్చిన పారిశ్రామిక విప్లవం తెలియజేసింది. ఇక తన ఊపిరితిత్తులతో ఊది ఊది మంటలను సృష్టించకుండా మోటార్ల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కుంపట్లను రగిలిస్తున్నారు.
చైనాలో కాలేజీలన్నీ ఉత్పత్తికి దగ్గరగా ఉన్నాయి. జీవితాలను మెరుగుపరిచేందుకు టెక్నాలజీ ఉపయోగపడాలి. వినియోగదారుని సేవలే పెట్టుబడిదారీ దేశాల చదువుగా మారింది. అందుకే కమ్యూనిస్టు దేశాలలో వినియోగదారుల సేవారంగానికి సంబంధించిన ప్రాధాన్యం కంటే శ్రమశక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది.
చైనాలో సైకిళ్లు ఎక్కువ, మాస్ కమ్యూనికేషన్ బస్సులెక్కువ, కార్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. సింగపూర్‌లో కారు లైసెన్స్‌కే ఒక లక్ష దాకా చెల్లించాలి. కారు అవసరమా? వీళ్లు జనరల్ ట్రాన్స్‌పోర్టులో ఎందుకు రాకూడదు? అలా రావడం వల్ల డబ్బు దుబారాను తగ్గించవచ్చు. కాలుష్య ప్రమాదాన్ని చాలా వరకు నివారించవచ్చు. అందుకే కాబోలు యూరప్‌లో బస్సులు ఎక్కువగా ఉంటాయి. అమెరికాలో గడపగడపకు కార్లుంటాయి. సంబంధిత దేశానికి ఉండే తాత్త్వికమైన దృష్టి, ఆలోచనల పైననే ఉత్పత్తి, సేవల రంగం ఆధారపడి ఉంటుంది.
మన పాలకులు మన ఇంజనీరింగ్ విద్యను సేవల రంగానికి పరిమితం చేసేశారు. ప్రపంచ బ్యాంకులు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. ఆ దిశలో డబ్బును కూడా పెద్ద ఎత్తున సమకూర్చుకోగలిగింది. మీరిచ్చే డబ్బు ఎంతైనా కానివ్వండి. కానీ మా విధానాలను మాత్రం కంట్రోల్ చేయబోమని స్పష్టంగా హామీ ఇవ్వాలని చైనా చెప్పింది. అలా చెప్పాకే ఇతర దేశాల దగ్గరనుంచి అప్పులు తీసుకుంది. అందువల్లనే చైనా తనదేశంలో అపారంగా