బ్యాడ్మింటన్‌లో స్వర్ణాలు

    ఢాకా: జాతీయ ఛాంపియన్లు చేతన్‌ ఆనంద్‌, తృప్తీ ముర్గండేతో కూడిన భారత పురుషుల, మహిళల జట్లు ఇక్కడ జరుగుతున్న 11వ దక్షిణాసియా క్రీడో త్సవాల్లో బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. పురుషుల, మహిళల టీం టైటిల్స్‌ భారత్‌ను వరించా యి. రెండు విభాగాల్లోనూ ఫైనల్లో శ్రీలంకతో తలపడిన భారత్‌ రెండింటి లోనూ విజేతగా నిలిచింది. రెండు విభాగాల్లోనూ 3-0తో విజయం సాధించింది. తృప్తీ ముర్గండే, సయాలీ గోఖలే, పి.సి.తులసిలతో కూడిన భారత జట్టు ముందుగా మహిళల విభాగంలో జరిగిన ఫైనల్లో గెలుపొందింది. చేతన్‌ ఆనంద్‌, ఆర్‌ఎంవి గురు సాయీదత్‌, ఆదిత్య ప్రకాశ్‌లతో కూడిన పురుషుల విభాగం కూడా తానేమీ తక్కువ కాద న్నట్లు టైటిల్‌ గెలుచుకుని మరో స్వర్ణ పతకాన్ని భారత ఖాతాలో చేర్చింది. ఆనంద్‌ శ్రీలంక నెంబర్‌ వన్‌ క్రీడా కారుడు నీలుకా కరుణరత్నేను 21-12, 21-18 తేడాతో ఓడించాడు.

    తొలి గేమ్‌లో ఒక దశలో 9-11తో వెనకబడిన ఆనంద్‌ ఆ తరువాత విజృంభించి ఆడాడు. గేమ్‌ను 37 నిమిషాల్లో ముగిం చాడు. గురు సాయీదత్‌ 21-8, 21-18 తేడాతో దినుకా కరుణరత్నేపై 33 నిమిషాల్లో విజయం సాధించాడు. ఆదిత్య ప్రకాశ్‌ 21-10, 21-15 తేడా తో సనావే థామస్‌పై గెలుపొందాడు. మహిళల విభాగంలో సయాలీ గోఖలీ భారత్‌కు తొలి విజ యాన్ని అందించింది. ఏక పక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఆమె 21-4,21-11 తేడాతో జయసింఘేను ఓడించింది. తృప్తి 21-9, 21-13తో రేణు హెత్తి రచింగే ను ఓడించి స్వర్ణ పతకం ఖాయం చేసింది. మూడో మ్యాచ్‌లోనూ తులసి విజయం సాధించ డంతో భారత్‌ విజయ పరంపర ముగి సింది. కాంస్య పతకాలు పురుషుల విభాగంలో బంగ్లాదేశ్‌కు, మహిళల విభాగంలో నేపాల్‌కు దక్కాయి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్