ప్రపంచ మహిళా నెం.1 బెలారస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా ఈ సంవత్సరం తొలి ఓటమి చవి చూసింది. బుధవారం రాత్రి సోనీ ఎరిక్‌సన్ మియామీ మాస్టర్స్ టోర్నీలో క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో మారియన్ బర్తోలీ చేతిలో 3-6, 3-6 తేడాతో వరుస సెట్లలో అజరెంకా ఓడింది. 2012లో అజరెంకా ఇప్పటి వరకు వరుసగా 26 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 1997లో మార్టినా హింగిస్ రికార్డు (37-0)పై కన్నేసిన అజరెంకాకు నిరాశే మిగిలింది. విక్టోరియా ఈ సంవత్సరం నాలుగు మేజర్ టైటిల్స్ నెగ్గి జోరు మీదుంది. అజరెంకా ఈ మ్యాచ్‌లో 16 విన్నర్ పాయింట్లు సాధించింది. 29 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసింది. ఆరు సార్లు సర్వీస్ కోల్పోయింది. నెం.7 బర్తోలీ సెమీస్‌లో నెం.5 అజనెక్షా రద్వాన్‌కాతో తలపడనుంది. రద్వాన్‌కా క్వార్టర్స్‌లో వినస్ విలియమ్స్‌ను 6-4, 6-1 తేడాతో ఓడించింది.
సెమీస్‌లో నదాల్, ముర్రే : మియామీ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ రఫెల్ నదాల్, బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే తాడోపెడో తేల్చుకోనున్నారు. ప్రపంచ నెం.2 నదాల్ క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో సోంగా (ఫ్రాన్స్)పై 6-2, 5-7, 6-4 తేడాతో విజయం సాధించాడు. 2009 ఛాంపియన్ ముర్రే క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో 4-6, 6-3, 6-4 తేడాతో జంకో టిప్‌సర్విక్ (సెర్బియా)పై గెలిచాడు.
java.lang.NullPointerException