ఇక్కడ జరుగుతున్న సింగపూర్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ హవా కొనసాగుతోంది. సెమీఫైనల్‌లో చైనా క్రీడాకారిణి లాన్ లూపై శనివారం జరిగిన పోటీలో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సైనా, టోర్నీలో తొలి నుంచీ మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. నాలుగో సీడ్ అయిన లాన్ లూను 8-12, 21-17, 21-8 తేడాతో 49 నిమిషాల్లో ఓడించింది. గతేడాది జూన్‌లో ఇడోనేషియన్ ఓపన్ సిరీస్‌లో విజేతగా నిలవడం ద్వారా తొలి సూపర్ సిరీస్‌ను కైవసం చేసుకున్న సైనా, సింగపూర్ ఓపెన్ సిరీస్‌ను కూడా గెల్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో జూ ఇయాంగ్ తారుతో తలపడుతుంది. శనివారం జరిగిన మరో సెమీఫైనల్‌లో కొరియా క్రీడాకారిణి యోన్ జూపై తారు 21-16, 21-18 తేడాతో నెగ్గింది. కాగా పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు శనివారం ఎదురుదెబ్బ తగిలింది. ఇండోనేషియాకు చెందిన ఏడో సీడెడ్ ఆటగాడు సోనీ కున్‌కోరో చేతి 19-21, 20-22 తేడాతో భారత ఆటగాడు పి.కశ్యప్ ఓడిపోయాడు. 48 నిమిషాలుపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యవ్ తీవ్రంగా పోరాడినా విజయం సాధించలేకపోయాడు.