హోంమంత్రి ఇంటి ముట్టడికి యత్నం

Dec 30,2023 22:18
జిల్లా పరిధిలో

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌

శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నా ప్రభు త్వం ఏమాత్రం స్పందించక పోవడంతో జనవరి 3న జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని నాయకులు హెచ్చరించారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద నిరసన ధర్నాను నిర్వహించారు. అనంతరం మంత్రి ఇంటిని ముట్ట డించేందుకు అంగన్‌ వాడీలు సిద్ధమయ్యారు. అయితే పోలీ సులు అంగన్‌వాడీ నాయక త్వంతో చర్చించి మంత్రి తానేటి వనిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తానే నిరసన శిబిరం వద్దకు వస్తానని హామీ ఇవ్వడంతో ఆర్‌డిఒ కార్యాలయం వద్దే ధర్నాను కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తానేటి వనిత శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిరసన శిబిరం వద్దకు చేరుకుని అంగన్‌వాడీల ప్రతినిధి బృందం ఇచ్చిన వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యలను సిఎం జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తానని, త్వరలోనే మంచి శుభవార్త వింటారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకత్వం మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీ ప్రభుత్వానికి పడుతుందని,ఇదే విధానంలో ప్రభుత్వం వ్యవహరిస్తే అంగన్‌వాడీల ఉద్యమ సత్తా ఏమిటో జగన్మోహన్‌ రెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూని జిల్లా ప్రధాన కార్యదర్శి కె.బేబీరాణి, జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.మాణిక్యాంబ, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.రాజులోవ, యూనియన్‌ నాయకులు సిహెచ్‌.అన్నపూర్ణ, కె.శారద, కె.సునీత, ఎన్‌.రామలక్ష్మి, సిహెచ్‌ఎల్‌వి. పుష్పవతి, ఎం.మాలతి, తదితరులు పాల్గొన్నారు. కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రాజా మద్దతు ఇచ్చారు.

➡️