‘హంద్రీ -నీవా’ కుప్పం ప్రజల జీవనాడిశ్రీ ఇచ్చిన మాట ప్రకారం ‘హంద్రీ -నీవా’ను పూర్తి చేసిన సీఎం రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి

'హంద్రీ -నీవా' కుప్పం ప్రజల జీవనాడిశ్రీ ఇచ్చిన మాట ప్రకారం 'హంద్రీ -నీవా'ను పూర్తి చేసిన సీఎం రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి

‘హంద్రీ -నీవా’ కుప్పం ప్రజల జీవనాడిశ్రీ ఇచ్చిన మాట ప్రకారం ‘హంద్రీ -నీవా’ను పూర్తి చేసిన సీఎం శ్రీ రాష్ట్ర విద్యుత్‌, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి ప్రజాశక్తి – రామకుప్పం, శాంతి పురం: ‘హంద్రీ – నీవా’ కాలువ కుప్పం ప్రజల జీవనాడి అని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ – నీవా కాలువ పూర్తి చేశారని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనులు శాఖ మంత్రి డాక్టరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గానికి సోమవారం రానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్‌, అటవీ శాఖ మంత్రి, చిత్తూరు ఎంపీ ఎన్‌ రెడ్డప్ప, కలెక్టర్‌ ఎస్‌ షన్మోహన్‌, ఎంఎల్‌సి భరత్‌, ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త తలశీల రఘురాంలు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గత ఎన్నికల సందర్భంగా కుప్పంకు హంద్రీ-నీవా నీటిని అందిస్తామని మాట ఇచ్చి పూర్తి చేశారన్నారు. కుప్పం ప్రాంతంలో అధిక సంఖ్యలో రైతులు హార్టికల్చర్‌పై ఆధారపడి ఉన్నారని, హంద్రీ -నీవా ద్వారా 54 చెరువులను నింపి దాదాపు 6,300 ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. పాలారు ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ఉన్న సందిగ్ధం తొలగిపోవడంతో త్వరలో నిర్మాణం చేపట్టేం దుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. తద్వారా కుప్పం నియోజక వర్గంలో తాగునీరు, సాగునీరు కొరత లేకుండా చూడలన్నది ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. కుప్పం నియోజకవర్గ అభివద్ధి పై ముఖ్యమంత్రి ప్రత్యేక దష్టి ఉంచి నాలుగున్నర సంవత్సరాలలో అన్ని విధాలా అభివద్ధి చేశారని, కుప్పం ను మున్సిపాల్టీగా ప్రకటించి చేపట్టిన మునిసిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం దాదాపు రూ.7 కోట్లతో పురోగతిలో ఉందన్నారు. రూ.66 కోట్లు మున్సిపాల్టీ అభివద్ధికి కేటాయించారని, కుప్పం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద హెలిప్యాడ్‌, హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు. శాంతిపురం మండలం గుండు శెట్టిపల్లి వద్ద బహిరంగ సభ హెలిపాడ్‌ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ ఎన్‌ ఎస్‌ ఎస్‌ సి రాజగోపాల్‌, ఆర్‌డిఓ లు, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️