సిబ్బంది పనితీరుపై ఎంపిడిఒ ఆగ్రహం

Jan 30,2024 21:22

ప్రజాశక్తి -బలిజిపేట: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బంది పనితీరుపై ఎంపిడిఒ కె.విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సుమారు 11.30 గంటల సమయంలో ఎంపిడిఒ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి తిరిగి కార్యాలయానికి వచ్చే సమయంలో ఒక్క ఉద్యోగి కూడా కార్యాలయంలో ఉండకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్‌ అసిస్టెంట్‌ కార్యాలయానికి వచ్చి వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లడం సరైన పద్ధతి కాదని, బయటకు వెళ్లేటప్పుడు ఎంపిడిఒ అనుమతి తీసుకోవాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది టైపిస్ట్‌ శ్రీనివాసరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ విక్టరీ అనుమతి తీసుకొని బయటకు వెళ్లారు. సీనియర్‌ అసిస్టెంట్‌ తనకు సమాచారం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని ఎంపిడిఒ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కొంత మంది సిబ్బంది రికార్డుల్లో గత మూడు, నాలుగు రోజులుగా సంతకాలు పెట్టకపోవడాన్ని చూసి ఎంపిడిఒ వాటిని ఆబ్‌సెంట్‌గా మార్కు చేయడం కొసమెరుపు. దీన్నిబట్టి మండల పరిషత్‌ కార్యాలయంలో ఉద్యోగులు రోజు విధులకు వస్తూ సంతకాలు రికార్డుల్లో చేయకపోవడం ప్రశ్నార్ధకంగా మారిందని, నిజంగా వీరు విధులకు వస్తున్నారా లేదా అన్న అనుమానాలు తేటతెల్లంగా కనిపిస్తున్నాయి.

➡️